News October 15, 2025

కామారెడ్డి జిల్లా వాతావరణం UPDATE

image

కామారెడ్డి జిల్లాలో గడిచిన 24 గంటల్లో నమోదైన వాతావరణ వివరాలను అధికారులు వెల్లడించారు. జిల్లాలో అక్కడక్కడ వర్షపాతం నమోదైంది. సోమూర్‌లో 43.8 మి.మీ నమోదు కాగా.. బిచ్కుందలో 10.3, మేనూర్ 6, కొల్లూరు 3.5, జుక్కల్, పుల్కల్ 3, బొమ్మన్ దేవిపల్లి 2.8, బీర్కూర్ 2.3, పెద్ద కొడప్గల్ 1.5, నస్రుల్లాబాద్‌లో 1 మి.మీ రికార్డ్ అయ్యాయి. గరిష్ఠ ఉష్ణోగ్రత సోమూర్‌లో 33.1°C, కనిష్ఠ ఉష్ణోగ్రత లచ్చపేటలో 20.8°C నమోదయ్యాయి.

Similar News

News October 16, 2025

జగిత్యాల: ‘నూతన ఓటర్లకు ఐడి కార్డులు వెంటనే పంపిణీ చేయాలి’

image

నూతనంగా నమోదు చేసుకున్న ఓటర్లకు ఐడీ కార్డుల పంపిణీని త్వరితగతిన పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ ఆదేశించారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన గురువారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓటర్ల జాబితా, బూత్ స్థాయి అధికారుల (బీఎల్ఓ) నియామకంపై సమీక్షించారు. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను ఏడు రోజుల్లో పరిష్కరించాలని అధికారులకు సూచించారు.

News October 16, 2025

SRCL: ‘పెండింగ్‌ ఓటర్ దరఖాస్తులు వెంటనే పరిష్కరించాలి’

image

పెండింగ్‌లో ఉన్న ఓటర్ దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) సి. సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. ఓటర్ల జాబితా, ఇతర అంశాలపై గురువారం ఆయన అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ నుంచి రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ ఎం. హరిత పాల్గొన్నారు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా జరిగేలా చూడాలని సీఈఓ సూచించారు.

News October 16, 2025

నారాయణపేట కలెక్టరేట్‌లో అధికారులకు CPRపై శిక్షణ

image

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నారాయణపేట కలెక్టరేట్ సమావేశ మందిరంలో CPR (Cardio Pulmonary Resuscitation)పై జిల్లా అధికారులకు ఈరోజు ట్రైనింగ్ కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ సిక్తా పట్నాయక్ పాల్గొని మాట్లాడుతూ.. “ప్రస్తుతం హార్ట్ అటాక్‌ కారణంగా చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే అత్యవసర పరిస్థితుల్లో CPR ద్వారా ప్రాణాలను కాపాడవచ్చు” అని తెలిపారు.