News October 15, 2025

‘తెలంగాణ విజన్’… మీ ఆలోచన ఏంటి?

image

తెలంగాణ రైజింగ్ విజన్-2047 పేరిట రాష్ట్ర ప్రభుత్వం ఓ డాక్యుమెంట్‌ను రూపొందిస్తోంది. అభివృద్ధి, సంక్షేమం విషయంలో రాష్ట్రాన్ని టాప్‌లో నిలబెట్టేలా ప్రజల నుంచి సలహాలు, సూచనలు స్వీకరిస్తోంది. వ్యవసాయం, ఆరోగ్యం, నూతన ఆవిష్కరణలు, స్థానిక సంస్థల బలోపేతం సహా పలు అంశాలపై ప్రతి పౌరుడు తప్పనిసరిగా OCT 25 లోగా ఈ ప్రజాభిప్రాయ సేకరణలో పాల్గొనాలని ప్రభుత్వం పిలుపునిచ్చింది. మీ ఆలోచన పంచుకోవడానికి <>క్లిక్ <<>>చేయండి.

Similar News

News October 15, 2025

విప్లవం లేదు గిప్లవం లేదు: సీఎం మార్పుపై సిద్దరామయ్య

image

కర్ణాటక కాంగ్రెస్‌లో CM మార్పు అంశం నెలలో ఒక్కసారైనా తెరపైకి రావడం సర్వ సాధారణమైంది. ఇటీవల రాష్ట్రంలో కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నవంబర్‌లో విప్లవం (క్రాంతి) రాబోతోందని వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఈ వ్యాఖ్యలపై సీఎం సిద్దరామయ్యను ఓ విలేకరి ప్రశ్నించగా ‘క్రాంతి లేదు భ్రాంతి లేదు’ అని కొట్టిపారేశారు. తానే సీఎంగా కొనసాగుతానని పునరుద్ఘాటించారు. నాయకత్వ మార్పుపై వచ్చేవన్నీ అసత్యాలేనని స్పష్టం చేశారు.

News October 15, 2025

బిహార్‌‌లో పురుష ఓటర్లదే ఆధిక్యం.. కానీ!

image

బిహార్‌‌లో పురుష ఓటర్లే అధికంగా ఉన్నారు. మొత్తం 3.92 కోట్ల పురుష ఓటర్లు ఉండగా స్త్రీ ఓటర్లు 3.5 కోట్లు ఉన్నారు. ప్రతి 1000 మంది పురుషులకు 892 మంది స్త్రీ ఓటర్ల నిష్పత్తి నమోదైంది. గత ఎన్నికల్లో (899) కన్నా ఇది తగ్గింది. స్త్రీలు తమ భర్తలు ఫారాలు తెచ్చినప్పుడే మాత్రమే ఓటర్లుగా నమోదవుతున్నారు. అయితే ఓటింగ్‌లో మాత్రం చురుగ్గా పాల్గొంటూ ఎన్నికల ఫలితాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారని NDA పేర్కొంది.

News October 15, 2025

2030 కామన్‌వెల్త్ గేమ్స్‌కు భారత్ ఆతిథ్యం

image

కామన్‌వెల్త్ గేమ్స్ నిర్వహణకు భారత్ ఎంపికైంది. 2030లో జరిగే ఈ క్రీడలు గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరగనున్నట్లు తెలుస్తోంది. 2010లో భారత్ తొలిసారి కామన్‌వెల్త్ గేమ్స్‌కు ఆతిథ్యం ఇచ్చిన సంగతి తెలిసిందే. 20 ఏళ్ల తర్వాత మరోసారి భారత్‌ ఈ క్రీడలకు వేదిక కానుంది. కాగా అహ్మదాబాద్‌ను కామన్‌వెల్త్ బోర్డు వేదికగా ప్రతిపాదించింది. దీనిపై వచ్చే నెల 26న తుది నిర్ణయం ప్రకటించనుంది.