News October 15, 2025
రూ.1000 పెరిగిన వండర్ హాట్ మిర్చి ధర

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో బుధవారం మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. తేజ మిర్చి క్వింటాకి మంగళవారం రూ.14,550 ధర పలకగా.. బుధవారం రూ.14,850కి పెరిగింది. అలాగే 341 రకం మిర్చి క్వింటాకు నిన్న రూ.16,150 ధర పలకగా..ఈరోజు రూ.15,900 కి పడిపోయింది. వండర్ హాట్(WH) మిర్చికి మంగళవారం రూ.15,500 ధర వస్తే.. నేడు రూ. 1000 పెరిగి రూ.16,500కు చేరుకుంది.
Similar News
News October 16, 2025
నాగర్‌కర్నూల్ జిల్లా ఎస్పీ ముఖ్య గమనిక

నాగర్‌కర్నూల్ జిల్లాలోని బాణసంచా దుకాణం దారులు తప్పనిసరిగా ఫైర్ డిపార్ట్‌మెంట్, తహశీల్దార్, సంబంధిత పోలీసుల అనుమతి తీసుకోవాలని జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రంగనాథ్ ఈరోజు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. దుకాణాదారులు రద్దీ ప్రదేశాలు, ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ప్రాంతాలు, పెట్రోల్ బంకుల సమీపంలో, ఎలక్ట్రానిక్ వైర్ల కింద దుకాణాలను ఏర్పాటు చేయొద్దని సూచించారు.
News October 16, 2025
ఆమెకు 1400 మరణశిక్షలు విధించాలి!

బంగ్లా మాజీ PM షేక్ హసీనాకు 1,400 మరణశిక్షలు విధించాలని ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్‌లో ఆ దేశ చీఫ్ ప్రాసిక్యూటర్ తాజుల్ వాదించారు. కనీసం ఒక్క మరణశిక్షైనా విధించకపోతే అన్యాయమేనన్నారు. అక్కడ గతేడాది JUL-AUGలో జరిగిన అల్లర్లలో 1400 మంది చనిపోయినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఈ మరణాలకు హసీనే కారణమని బంగ్లా ప్రభుత్వం వాదిస్తోంది. ప్రస్తుతం ఆమె భారత్‌లో ఆశ్రయం పొందుతున్న విషయం తెలిసిందే.
News October 16, 2025
డిజిటల్ నైపుణ్యానికి వేదికగా ఫ్రమ్ నూజివీడు ఉయ్ లీడ్

డిజిటల్ నైపుణ్యాలను ప్రదర్శించేందుకు చక్కని వేదికగా ఫ్రమ్ నూజివీడు ఉయ్ లీడ్ ఎంతగానో ఉపయోగపడుతుందని సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న అన్నారు. నూజివీడులో సబ్ కలెక్టర్ గురువారం రాత్రి మాట్లాడారు. సోషల్ మీడియా, క్రియేటర్స్ శుక్రవారం ఉదయం 10 గంటలకు సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే వేదికను వినియోగించుకోవాలన్నారు. డిజిటల్ ప్రతిభ ప్రదర్శించి అభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు.