News October 15, 2025
రౌడీషీటర్ నవీన్‌రెడ్డి నగర బహిష్కరణ

రాచకొండ పోలీసులు కఠిన నిర్ణయం తీసుకున్నారు. నల్గొండకు చెందిన రౌడీషీటర్ కొడుదుల నవీన్ రెడ్డిపై రాచకొండ సీపీ సుధీర్ బాబు నగర బహిష్కరణ ఉత్తర్వులు జారీ చేశారు. దాడులు, హత్యాయత్నం, బెదిరింపుల కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తున్నాడన్న కారణంగా అధికారులు 6 నెలల బహిష్కరణ ప్రతిపాదన తీసుకురాగా సీపీ ఉత్తర్వులు ఇచ్చారు. ఆయన ప్రస్తతం అబ్దుల్లాపూర్‌మెట్ పరిధి మన్నెగూడలో ఉంటున్నాడు.
Similar News
News October 15, 2025
HYD: స్వీట్ షాపుల్లో తనిఖీలు

GHMC ఫుడ్ సేఫ్టీ కంట్రోలర్ మూర్తి రాజ్ ఆధ్వర్యంలో గ్రేటర్‌లోని పలు స్వీట్ షాపుల్లో అధికారులు తనిఖీలు చేపట్టారు. దీపావళి పండుగ నేపథ్యంలో ఈ రైడ్స్ నిర్వహించినట్లు తెలిపారు. కనీస రూల్స్ పాటించని వ్యాపారుల పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని షాప్‌లకు నోటీసులు జారీ చేశారు. శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌కు పంపించామని మూర్తి రాజ్ వెల్లడించారు. సిటీలోని మొత్తం 43 స్వీట్ షాపుల్లో ఈ తనికీలు కొనసాగాయి.
News October 15, 2025
HYD: బైక్ మీద వెళితే.. కుక్కలతో జాగ్రత్త!

టూ వీలర్‌పై వెళుతున్నపుడు వాహనం కంట్రోల్‌లో ఉండాలి. కుక్కలు కూడా సిటీలో వాహనచోదకులను ఇబ్బంది పెడుతున్నాయి. వీధి కుక్కలు అప్పుడప్పుడు రోడ్లపై సడన్‌గా బండికి అడ్డంగా వస్తుంటాయి. అప్పుడు బైక్ కంట్రోల్ కాకపోతే ప్రమాదాలకు గురవుతాం. ఒక్కోసారి ప్రాణాలు కూడా పోతాయి. ఇలా నిన్న తుకారాంగేట్ వద్ద ప్రాణాలు కోల్పోయింది అడ్డగుట్టకు చెందిన స్వప్న (42). భర్తతో కలిసి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. సో.. జాగ్రత్త.
News October 15, 2025
HYDలో నాసిరకం నర్సింగ్!

నాసిరకం సౌకర్యాలు.. అంతంత మాత్రమే బోధన.. ఇదీ నర్సింగ్ స్కూళ్ల నిర్వాహకుల నిర్వాకం. దీంతో పలువురు నర్సింగ్ స్కూళ్ల వ్యవహారంపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడంతో నర్సింగ్ కౌన్సిల్ తనిఖీలకు ప్రత్యేకంగా కమిటీలను నియమించింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని కళాశాలలపైనే ఎక్కువగా ఫిర్యాదులందాయి. కమిటీ స్కూళ్లల్లో తనిఖీలు నిర్వహించి సర్కారుకు నివేదిక ఇవ్వనుంది.