News October 15, 2025

ఇక సెలవు.. ఆయుధం వదిలిన ‘అడవిలో అన్న’

image

మావోయిస్టు పార్టీలో ఓ శకం ముగిసింది. 40 ఏళ్ల సుదీర్ఘ పోరాటానికి టాప్ కమాండర్ మల్లోజుల వేణుగోపాల్ సెలవు పలుకుతూ జనజీవన స్రవంతిలో కలిశారు. 1981లో అజ్ఞాతంలోకి వెళ్లి ఏటూరునాగారం దళ సభ్యుడిగా ఆయుధం చేతబట్టారు. పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు. 1993లో DKS జడ్పీ సభ్యుడిగా, 1995లో కేంద్ర కమిటీ సభ్యుడిగా, 2007లో పొలిట్ బ్యూరో సభ్యుడిగా నియమితులయ్యారు. 4 దశాబ్దాల్లో ఎన్నో ఎన్‌కౌంటర్లకు నాయకత్వం వహించారు.

Similar News

News October 15, 2025

నవంబర్ నుంచి క్షేత్రస్థాయిలో తనిఖీలు: CBN

image

AP: పథకాల అమలుపై నవంబర్ నుంచి క్షేత్రస్థాయిలో తనిఖీ చేస్తానని CM CBN వెల్లడించారు. ‘సుపరిపాలన అందిస్తున్నాం. సంక్షేమ పథకాలు, GST సంస్కరణల లబ్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. అధికారులు థియేటర్లలో స్లైడ్స్ ప్రదర్శించాలి. టెక్నాలజీ డేటాను ఆడిట్ చేసి ప్రజల సంతృప్తి స్థాయి తెలుసుకుంటా. అధికారులిచ్చే సమాచారానికి వాస్తవాలకు పొంతన ఉండాలి’ అని సూచించారు. కొన్ని పార్టీల కుట్రలను టెక్నాలజీతో బయట పెట్టామన్నారు.

News October 15, 2025

గూగుల్ డేటా సెంటర్‌కు పోల’వరం’!

image

విశాఖలో ఏర్పాటు చేయబోయే గూగుల్ డేటా సెంటర్‌కు భారీ స్థాయిలో నీరు అవసరమని నిపుణులు చెబుతున్నారు. ఏడాదికి 1 టీఎంసీ జలాలు అవసరం అవుతాయని అంటున్నారు. అయితే పోలవరం లెఫ్ట్ మెయిన్ కాలువ ద్వారా విశాఖకు ఏడాదికి 23.44 TMCల నీరు సరఫరా కానుంది. ఆ ప్రాజెక్టు 2028 నాటికి పూర్తి కానుంది. దీనివల్ల నీటి సమస్య తీరే ఛాన్స్ ఉంది. ఇక గ్రీన్ హైడ్రోజన్, సోలార్, విండ్ పవర్.. డేటా సెంటర్ విద్యుత్ అవసరాలను తీర్చనున్నాయి.

News October 15, 2025

ఢిల్లీకి సంజూ? KKRకు కేఎల్ రాహుల్?

image

సంజూ శాంసన్‌ను దక్కించుకునేందుకు ఢిల్లీ క్యాపిటల్స్ ఆసక్తిగా ఉన్నట్లు జాతీయ మీడియా తెలిపింది. అక్షర్ స్థానంలో శాంసన్‌కు ఆ బాధ్యతలు అప్పగించాలని భావిస్తున్నట్లు సమాచారం. సంజూకు బదులు ఏ ప్లేయర్‌ను RRకు ట్రేడ్ చేయాలనే దానిపై సమాలోచనలు జరుపుతున్నట్లు టాక్. ఇక ఢిల్లీ స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్ కోసం KKR ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు సమాచారం. ఆయనకు కెప్టెన్సీ ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది.