News October 15, 2025
ఉరేసుకుని ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

మనుబోలు(M) కాగితాలపూరు క్రాస్ రోడ్‌లోని పంజాబీ డాబా పక్కనే ఉన్న పొదలలో ఓ ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం వెలుగు చూసింది. జట్లకొండూరుకు చెందిన కసుమూరు రమేశ్(18) వేప చెట్టుకు ఉరి వేసుకుని ఉండడాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. SI శివ రాకేశ్ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గూడూరుకు తరలించారు.
Similar News
News October 16, 2025
నెల్లూరు చేపల పులుసా.. మజాకా.!

నెల్లూరు చేపల పులుసుకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తాజా చేపలతో చేసే ఈ పులుసును ఎవరైనా లొట్టలేసుకుంటూ తినాల్సిందే. మన నెల్లూరు చేపల పులుసును ఇతర దేశాలకు సైతం సరఫరా చేస్తున్నారంటే అతిశయోక్తి కాదు. నెల్లూరు చేపల కూరలతో మెట్రోపాలిటన్ సిటీలో కూడా వ్యాపారాలు కొనసాగుతున్నాయి. టేస్ట్‌తోపాటూ దీనిలోని సహజ పోషక లక్షణాలు హృదయ రోగులకు ఎంతో మేలు చేస్తాయి.
# నేడు ప్రపంచ ఆహార దినోత్సవం.
News October 16, 2025
కూతురిపై అత్యాచారం.. తండ్రికి జీవిత ఖైదు

కూతురిపై తాగిన మైకంలో అత్యాచారానికి పాల్పడిన ఓ తండ్రికి కోర్టు జీవిత ఖైదు విధించింది. జలదంకి మండలానికి చెందిన బాలరాజు 2019 జూన్ 24న ఇంట్లో ఎవరూ లేని సమయంలో కూతురిపై అత్యాచారం చేశారు. ఆమెకు గర్భం రావడంతో బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోక్సో కేసు నమోదైంది. నేరం రుజువు కావడంతో అతడికి జీవిత ఖైదుతో పాటు రూ.50 వేలు జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది.
News October 16, 2025
నెల్లూరు: నెల రోజులు ఇండస్ట్రీ పార్ట్నర్ షిప్ డ్రైవ్

నెల్లూరు జిల్లాలో బుధవారం నుంచి నెల రోజులు APIICఆధ్వర్యంలో ఇండస్ట్రీ పార్టనర్ షిప్ డ్రైవ్ నిర్వహిస్తామని కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. కందుకూరు సబ్ కలెక్టరేట్‌లో సంబంధిత వాల్ పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. స్థానిక పరిశ్రమల అభివృద్ధి, మౌలిక సదుపాయాల విస్తరణ, నూతన పెట్టుబడులకు ప్రోత్సాహం, యువతకు ఉపాధి అవకాశాల సృష్టే లక్ష్యంగా డ్రైవ్ జరుగుతుందన్నారు.