News October 15, 2025
సిద్దిపేట: బాలికల పాఠశాలల్లో సీట్ల భర్తీకి రేపే లాస్ట్

సిద్దిపేట జిల్లాలోని పలు మండలాల్లోని బాలికల పాఠశాలల్లో 5వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేయనున్నట్లు డీసీఓ పోలోజు నరసింహచారి బుధవారం తెలిపారు. సిద్దిపేట రూరల్, హుస్నాబాద్, దుబ్బాక, గజ్వేల్, ములుగు సహా 13 మండలాల్లోని బాలికల పాఠశాలల్లో ఈ అవకాశం ఉంది. ఆసక్తి గల విద్యార్థులు సీట్ల కోసం ఈ నెల 16లోగా దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు.
Similar News
News October 15, 2025
ఇల్లందు: సింగరేణి అభివృద్ధికి మేధోమథనం

సింగరేణి సంస్థ భవిష్యత్తులో 100 మిలియన్ టన్నుల వార్షిక బొగ్గు ఉత్పత్తి లక్ష్యం దిశగా పయనించడానికి భవిష్యత్ ప్రణాళికపై మేధోమథన కార్యక్రమాన్ని నిర్వహించారు. సీఎండీ బలరాం ఆదేశాల మేరకు ఇల్లందు హెడ్ ఆఫీస్‌లో సీపీపీ, హెచ్‌ఆర్‌డీ విభాగాల ఆధ్వర్యంలో జనరల్ మేనేజర్ మనోహర్ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. ఇందులో డైరెక్టర్లు, పదవీ విరమణ పొందిన డైరెక్టర్లు పాల్గొన్నారు.
News October 15, 2025
మహిళల అభ్యున్నతికి ప్రణాళిక రూపొందించాలి: కలెక్టర్

భద్రాచలం ఐటీడీఏ కార్యాలయాన్ని కలెక్టర్ జితేష్ వి పాటిల్, ప్రాజెక్ట్ అధికారి రాహుల్, సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠతో కలిసి బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు ఎన్‌ఆర్‌సీ, నాయకపోడు మాస్కుల తయారీ కేంద్రం, గిరిజన భవనం, గిరి బజార్‌లను పరిశీలించారు. ఐటీడీఏ భవనాలలో గిరిజన మహిళలకు సంక్షేమ పథకాలు, కల్చరల్ పెయింటింగ్, ఇతర అంశాలపై శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్ సూచించారు.
News October 15, 2025
TU: ప్రశాంతంగా ముగిసిన ఎంఈడీ రెండో సెమిస్టర్ పరీక్షలు

తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలోని M.Ed రెండో సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని అకాడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఆచార్య ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. ఈ నెల 8వ తేదీ నుంచి 15వ తేదీ వరకు విద్యార్థులు ఒక్కరు మినహా మిగతా విద్యార్థులు అన్ని పరీక్షలకు హాజరయ్యారన్నారు. విద్యార్థులు ఎటువంటి మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడలేదని వెల్లడించారు. బుధవారం జరిగిన పరీక్షలకు 29 మంది హాజరైనట్లు తెలిపారు.