News October 15, 2025
కామారెడ్డి: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

కామారెడ్డి జిల్లాలో ఇవాళ ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. బిక్కనూరు మండలం జంగంపల్లి వద్ద 44వ జాతీయ రహదారిపై కామారెడ్డి నుంచి రామాయంపేట వైపు బైక్‌పై వెళ్తున్న వారిని రాంగ్ రూట్‌లో ఎదురుగా వచ్చిన టిప్పర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News October 17, 2025
KNR: తీవ్ర ఉద్రిక్తత నడుమ అభిప్రాయాల సేకరణ

KNR జిల్లా కాంగ్రెస్, నగర కాంగ్రెస్ అధ్యక్ష పదవుల నియామక ప్రక్రియలో భాగంగా ఏఐసీసీ పరిశీలకులు శ్రీనివాస్ మానే గురువారం ముఖ్య నేతల అభిప్రాయాలను సేకరించారు. పార్టీ కార్యాలయం వద్ద కార్యకర్తల ఆందోళనతో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నప్పటికీ, అభిప్రాయాల సేకరణ కొనసాగింది. కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ ముఖ్య నేతలు ఒక్కొక్కరుగా ప్రత్యేక గదిలోకి వెళ్లి పరిశీలకులకు తమ అభిప్రాయాన్ని తెలిపారు.
News October 17, 2025
భద్రాద్రి జిల్లాలో నేటి ముఖ్యాంశాలు..!

✓ కొత్తగూడెం ఎర్త్ సైన్స్ యూనివర్సిటీకి క్యాబినెట్ ఆమోదం
✓ చుంచుపల్లి: మద్యానికి బానిసై యువకుడి ఆత్మహత్య
✓ మత్తు పదార్థాలు నియంత్రించాలని ఇల్లందులో పోలీసుల ర్యాలీ
✓ అశ్వాపురం: అక్రమంగా ఇసుక రవాణా.. 9 మందిపై కేసు
✓ మణుగూరు: అశోక్ నగర్‌లో పోలీసుల కార్డెన్ సెర్చ్
✓ భద్రాచలం: గుండెపోటుతో ఆర్టీసీ కండక్టర్ మృతి
✓ బూర్గంపాడు: చెరువులో పడి వ్యక్తి మృతి
✓ జాతీయస్థాయిలో కరకగూడెం బిడ్డకు స్వర్ణం
News October 17, 2025
నర్సాపూర్: ముగ్గురు ఉపాధ్యాయులు సస్పెండ్

నర్సాపూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న ముగ్గురు ఉపాధ్యాయులను జిల్లా విద్యాధికారి డాక్టర్ రాధా కిషన్ సస్పెండ్ చేశారు. ఉన్నత పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఒక ప్రధానోపాధ్యాయుడు, ఇద్దరు ఉపాధ్యాయులు విధుల పట్ల నిర్లక్ష్యం వహించాలన్న సమాచారంతో విచారణ చేపట్టిన డీఈవో వారిని గురువారం సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు.