News October 15, 2025
మేడిగడ్డ పునరుద్ధరణకు వడివడిగా అడుగులు

TG: వరదల్లో దెబ్బతిన్న మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మరమ్మతులకు ప్రభుత్వం చురుగ్గా కదులుతోంది. పునరుద్ధరణ ప్లాన్, డిజైన్లకోసం బిడ్ల దాఖలు నేటితో ముగియనుంది. HYD, మద్రాస్, రూర్కీ IITలు టెండర్లు దాఖలు చేశాయి. మరికొన్ని ప్రముఖ సంస్థలు కూడా బిడ్లు వేసేందుకు రెడీగా ఉండడంతో గడువు పొడిగించడంపై ఆలోచిస్తోంది. NDSA సిఫార్సులకు అనుగుణంగా ఉన్న బిడ్‌ను ఆమోదించి నిర్మాణ పనులకు టెండర్లు పిలవనుంది.
Similar News
News October 16, 2025
రాత్రిళ్లు పసుపు కలిపిన పాలు తాగుతున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచేందుకు పసుపు కలిపిన పాలు తాగడం మేలని వైద్యులు చెబుతున్నారు. ఈ పాలను నెలరోజుల పాటు రాత్రిళ్లు తీసుకుంటే ఆరోగ్యకరమని అంటున్నారు. ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా నిరోధిస్తుంది. చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఎముకలు, కీళ్లను బలపరచడమే కాకుండా జీర్ణక్రియ సాఫీగా జరిగేలా చేస్తుంది. అంతేకాకుండా రాత్రి పూట ప్రశాంతమైన నిద్రకు ఉపయోగపడుతుంది.
News October 15, 2025
పొట్టి శ్రీరాములు విగ్రహానికి ‘స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైజ్’గా నామకరణం

AP: అమరావతిలో నిర్మించనున్న 58 అడుగుల ఎత్తైన అమరజీవి పొట్టిశ్రీరాములు విగ్రహ నమూనాలను CM చంద్రబాబు సచివాలయంలో పరిశీలించారు. విగ్రహానికి ‘స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైజ్’గా నామకరణం చేశారు. శాఖమూరులో 6.8 ఎకరాల్లో మెమోరియల్ ట్రస్ట్, స్మృతి వనాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. వచ్చే ఏడాది మార్చి 16న పొట్టి శ్రీరాములు 125వ జయంతి నాటికి ఈ స్మృతివనంలో విగ్రహాన్ని ప్రారంభించాలని నిర్ణయించింది.
News October 15, 2025
అఫ్గాన్ ప్లేయర్లకు టాప్ ర్యాంకులు

ICC ర్యాంకింగ్స్‌లో అఫ్గానిస్థాన్ ప్లేయర్లు సత్తా చాటారు.
*వన్డే బౌలర్లలో రషీద్ ఖాన్‌కు నం.1 ర్యాంక్
*వన్డే ఆల్‌రౌండర్లలో అజ్మతుల్లా ఒమర్జాయ్‌కు నం.1 ర్యాంక్
*వన్డే బ్యాటర్లలో ఇబ్రహీం జర్దాన్‌కు రెండో ర్యాంక్
> మరోవైపు భారత ప్లేయర్లు కూడా ర్యాంకింగ్స్ దక్కించుకున్నారు. టెస్టు బౌలర్లలో బుమ్రా, టీ20 బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, వన్డే బ్యాటర్లలో గిల్, టీ20 బ్యాటర్లలో అభిషేక్ నం.1 ర్యాంకుల్లో ఉన్నారు.