News October 15, 2025

సత్తెనపల్లి: విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించిన టీచర్ సస్పెండ్

image

సత్తెనపల్లి మండలంలోని ఫణిదం గ్రామంలో విద్యార్థినితో అనుచితంగా ప్రవర్తించిన జెడ్పీ హైస్కూల్ ఉపాధ్యాయుడు జరార్డ్ బాబుపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. ఘటనపై తల్లిదండ్రులు, మహిళలు ఆగ్రహంతో ఉపాధ్యాయుడిని చితకబాదగా, గ్రామ పెద్దలు ఇటువంటి ఘటనలు మళ్లీ జరగరాదని హెచ్చరించారు. ఈ వ్యవహారంపై స్పందించిన డీఈఓ చంద్రకళ ఉపాధ్యాయుడు జరార్డ్ బాబును సస్పెండ్ చేసినట్లు ప్రకటించారు.

Similar News

News October 16, 2025

ఉద్యోగులకు సీపీఆర్‌పై అవగాహన ఉండాలి: డీఎంహెచ్వో

image

ప్రతి ఉద్యోగికి సీపీఆర్‌పై అవగాహన ఉండాలని డీఎంహెచ్వో గోపాలరావు అన్నారు. ములుగు కలెక్టరేట్‌లో సీపీఆర్‌పై అవగాహన కల్పించారు. మనిషికి మానసిక ఒత్తిడి కారణంగా మెదడుకు రక్తప్రసరణ జరగక గుండె కొట్టుకోవడం ఆగిపోతుందన్నారు. అప్పుడు సీపీఆర్ ప్రక్రియ చేయాలని, దీని ద్వారా గుండె కొట్టుకోవడంతో పాటు మనిషి కోలుకోవడానికి సహాయపడుతుందన్నారు.

News October 16, 2025

ఈనెల 25నాటికి ఈ-పంట నమోదు పూర్తి చేయాలి: జేసీ

image

బాణాసంచా తయారీ కేంద్రాలలో తనిఖీలు నిర్వహించాలని అనకాపల్లి జిల్లా జేసీ ఎం.జాహ్నవి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో అధికారులతో జేసీ మాట్లాడారు. బాణాసంచా తయారీ కేంద్రాల్లో భద్రతా లోపాలను గుర్తించాలన్నారు. ఓటర్ లిస్టులకు సంబంధించి వెరిఫికేషన్ పూర్తి చేసి మ్యాపింగ్ పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.

News October 16, 2025

గద్వాల్: ‘అక్రమంగా మట్టి తరలిస్తున్నా పట్టించుకోని అధికారులు’

image

జోగులాంబ గద్వాల్ జిల్లా కేంద్రంలో మట్టి దందా ఆగడం లేదు. పట్టపగలే అక్రమంగా మట్టిని తవ్వి తరలిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. కొందరు ట్రాక్టర్‌ను ఆపి డ్రైవర్‌ను అడగగా రాజకీయ పార్టీ నాయకుల పేర్లు చెప్పాడు. రాజకీయ నాయకుల అండతో అక్రమ దందా జోరుగా సాగుతోంది. కలెక్టర్ స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.