News October 15, 2025

సికింద్రాబాద్: సంతోషం.. ఇప్పటికైనా మేల్కొన్నారు!

image

రైళ్లల్లో రోజూ వేల మంది టికెట్ లేకుండా ప్రయాణిస్తున్నారు. ఇది రైల్వే అధికారులకూ తెలుసు. వారిని పట్టుకునేందుకు ప్రత్యేక వ్యవస్థా ఉంది. అయితే ఎందుకో రైల్వే అధికారులు అసలు టికెట్ చెకింగ్ అనేదే చేయడం లేదని తెలుస్తోంది. ఇప్పటికైనా మేల్కొన్న అధికారులు తనిఖీలు చేయాలని నిర్ణయించి ఒక్కరోజు (మంగళవారం)లోనే రూ.కోటి పాయలు వసూలు చేశారు. ముందు నుంచే ఈ పని చేసి ఉంటే బాగుండేదని పలువురు పేర్కొంటున్నారు.

Similar News

News October 17, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News October 17, 2025

శుభ సమయం (17-10-2025) శుక్రవారం

image

✒ తిథి: బహుళ ఏకాదశి మ.1.08 వరకు
✒ నక్షత్రం: మఖ సా.4.38 వరకు
✒ శుభ సమయం: ఉ.10.00-10.30
✒ రాహుకాలం: ఉ.10.30-మ.12.00
✒ దుర్ముహూర్తం: ఉ.8.24-ఉ.9.12, మ.12.24-మ.1.12
✒ వర్జ్యం: శే.ఉ.6.08 వరకు, రా.12.52-2.30
✒ అమృత ఘడియలు: మ.3.00-మ.4.36 * ప్రతిరోజూ పంచాంగం, <<-1>>రాశిఫలాలు<<>> కోసం క్లిక్ చేయండి.

News October 17, 2025

సిద్దిపేట: ఇబ్బందులు లేకుండా కొనుగోలు చేయండి: కలెక్టర్

image

ఖరీఫ్ 2025-26 సీజన్ వరిధాన్యం సులభంగా రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు ప్రక్రియ జరిగేలా మిల్లర్లు, అధికారులు పనిచేయాలని కలెక్టర్ కె.హైమావతి ఆదేశించారు. గురువారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని సమావేశ మందిరంలో రైస్ మిల్లర్ అసోసియేషన్ ప్రతినిధులు, జిల్లా సివిల్ సప్లై, డీఆర్డీఓ అధికారులులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు.