News October 15, 2025
PCC చీఫ్ సబ్జెక్టు తెలుసుకుని మాట్లాడాలి: MP

రాష్ట్ర PCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌కు ROB నిధులపై సరైన అవగాహన లేదని, ముందుగా సబ్జెక్ట్ తెలుసుకొని మాట్లాడాలని నిజామాబాద్ MP అరవింద్ ధర్మపురి సూచించారు. బుధవారం MP మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం BJPపై బురద జల్లి BRSను కాపాడే ప్రయత్నం చేస్తుందని, కాళేశ్వరంపై రాష్ట్ర ప్రభుత్వమే కమిటీ వేసి అవకతవకలు ఉన్నాయని తేలినా ఏమి చేయలేదన్నారు.
Similar News
News October 16, 2025
సీపీఆర్‌తో ప్రాణాలను రక్షించవచ్చు: కలెక్టర్

గుండెపోటుకు గురైన వారికి సకాలంలో సీపీఆర్ (కార్డియోపల్మనరీ రీససిటేషన్) చేసి ప్రాణాలను రక్షించవచ్చని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో సీపీఆర్‌పై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితుల్లో అకస్మాత్తుగా వచ్చే గుండెపోటుకు సీపీఆర్ ఎంతో ఉపయోగమన్నారు. ప్రతి ఒక్కరు దీనిపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.
News October 16, 2025
నిజామాబాద్: ఈనెల 18న జిల్లావ్యాప్త బంద్

బీసీ రిజర్వేషన్లకు పార్లమెంటులో చట్టం చేయాలని బీసీ హక్కుల సాధన సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి చక్రపాణి డిమాండ్ చేశారు. గురువారం విలేకరులతో మాట్లాడుతూ.. బీసీలకు 42 శాతం స్థానిక సంస్థల్లో రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానించినట్లు తెలిపారు. బీసీ రిజర్వేషన్ల బిల్లుకు కేంద్ర ప్రభుత్వం అడ్డు పడుతుందని ఆయన విమర్శించారు. ఈనెల 18న జిల్లా వ్యాప్తంగా బంద్ విజయవంతం చేయాలని కోరారు.
News October 16, 2025
నిజామాబాద్: అభివృద్ధి పనులు గడువులోగా పూర్తి చేయాలి: కలెక్టర్

ప్రజలకు మెరుగైన సదుపాయాలు అందించేందుకు చేపట్టిన అభివృద్ధి పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం నిజామాబాద్‌లో కొనసాగుతున్న మాధవనగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులతో పాటు ఖలీల్‌వాడిలో నిర్మాణంలో ఉన్న వెజ్-నాన్‌వెజ్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డు తదితర పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నాణ్యత విషయంలో రాజీ పడరాదని సూచించారు.