News October 15, 2025

రోడ్డు ప్రమాదం.. కుటుంబంలో నలుగురు మృతి

image

TG: కామారెడ్డి(D) భిక్కనూరు హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టిప్పర్ రూపంలో దూసుకొచ్చిన మృత్యువు తాత, తల్లి, పిల్లలను కబళించింది. ఖమ్మం(D) ముస్తికుంటకు చెందిన వీరు స్కూటీపై వెళ్తుండగా రాంగ్‌రూట్లో వచ్చిన టిప్పర్ బలంగా ఢీకొట్టింది. తల్లి, ఆరేళ్ల బాలుడు అక్కడికక్కడే మరణించారు. తీవ్రంగా గాయపడ్డ తాత, రెండేళ్ల పాపను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయారు.

Similar News

News October 16, 2025

8th పే కమిషన్ సిఫార్సులు మరింత ఆలస్యం!

image

కేంద్ర ప్రభుత్వ 8th పే కమిషన్ సిఫార్సులు ఆలస్యం కావొచ్చు. కమిషన్‌ను కేంద్రం JANలో ప్రకటించినా విధివిధానాలు తేల్చలేదు. పదేళ్లకోసారి ఉద్యోగుల జీతాలు సవరించాలి. 7th పే కమిషన్ 2014లో ఏర్పాటు కాగా సిఫార్సులు 2016లో అమల్లోకొచ్చాయి. ప్రస్తుత కమిషన్ సిఫార్సులు 2026లో అమల్లోకి రావాలి. కానీ 2027లో కూడా అమలు కాకపోవచ్చని ‘కొటక్ ఇన్‌స్టిట్యూషనల్ ఈక్విటీస్’ పేర్కొంది. ఫిట్మెంటు 1.8xగా ఉండొచ్చని అంచనా వేసింది.

News October 16, 2025

విశాఖలో ₹1,222 కోట్లతో లులు ప్రాజెక్టు

image

AP: విశాఖకు AI హబ్, డిజిటల్ డేటా సెంటర్ రానుండడంతో ‘లులు’ తన ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు ఏర్పాటుకు రెడీ అవుతోంది. రూ.1,222 కోట్లతో హార్బర్ పార్కు వద్ద 13.74 ఎకరాల్లో వచ్చే ఈ ప్రాజెక్టులో హైపర్ మార్కెట్, ఫ్యాషన్ స్టోర్, లులు కనెక్ట్, ఫన్ టూర్‌ వంటివి ఉంటాయి. దీనికి ప్రభుత్వం పలు రాయితీలిస్తోంది. ఇటీవల క్యాబినెట్లో మంత్రి నాదెండ్ల మనోహర్ అభ్యంతరం తెలిపినా ప్రభుత్వం సవరించిన నిబంధనలకు ఓకే చెప్పింది.

News October 16, 2025

‘టెస్ట్ 20’.. క్రికెట్‌లో సరికొత్త ఫార్మాట్

image

టెస్ట్, టీ20ల కలయికతో ‘టెస్ట్ 20’ అనే సరికొత్త ఫార్మాట్‌ రాబోతోంది. ఇందులో రెండు జట్లు 20 ఓవర్ల చొప్పున ఒకే రోజు 2 ఇన్నింగ్స్‌లు ఆడతాయి. టెస్టు మ్యాచ్‌లా 2సార్లు బ్యాటింగ్ చేయొచ్చు. 2026 JANలో ‘జూనియర్ టెస్ట్ 20 ఛాంపియన్‌షిప్’ తొలి సీజన్ నిర్వహించనున్నట్లు ఈ ఫార్మాట్ ఫౌండర్ గౌరవ్ బహిర్వాని తెలిపారు. దీనికి మాజీ ప్లేయర్స్ ఏబీ డివిలియర్స్, క్లైవ్ లాయిడ్, హెడెన్, హర్భజన్ సలహాదారులుగా ఉన్నారు.