News October 15, 2025
పెండింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి: సీపీ

రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆధ్వర్యంలో బుధవారం నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. కేసుల దర్యాప్తులో వేగం, పెండింగ్ కేసులు త్వరితగతిన పరిష్కారం, మహిళల భద్రత, ప్రాపర్టీ నేరాలు, రోడ్డు ప్రమాదాలు, సైబర్ క్రైమ్స్ నియంత్రణపై అధికారులు దృష్టి సారించాలని సీపీ సూచించారు. గంజాయి, చట్ట వ్యతిరేక చర్యలపై కఠిన చర్యలు తీసుకోవాలని, విధుల్లో అలసత్వం చూపితే శాఖా పరమైన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.
Similar News
News October 16, 2025
పాక్-అఫ్గాన్ మధ్య సీజ్ ఫైర్.. ట్రంప్‌పై సెటైర్లు!

పాకిస్థాన్-అఫ్గాన్ దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అంతా US అధ్యక్షుడు ట్రంప్ రియాక్షన్ కోసం ఎదురు చూస్తున్నారు. ‘ఇప్పటికే 8 యుద్ధాలు ఆపానని చెప్పుకుంటున్న ఆయన ఇంకా ఈ క్రెడిట్ తన ఖాతాలో వేసుకోలేదా?’ అని నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. ‘ఆయన ఆ మాట చెప్పగానే నోబెల్‌కి మరోసారి నామినేట్ చేసేందుకు పాక్ ఆర్మీ చీఫ్ ఆసిం మునీర్ సిద్ధంగా ఉన్నారు’ అంటూ సెటైర్లు వేస్తున్నారు.
News October 16, 2025
ASF: ఆర్థిక స్థోమత లేని ఖైదీలకు ఉచిత న్యాయ సేవలు

ఆర్థిక స్థోమత లేని ఖైదీలకు ఉచిత న్యాయ సేవలు అందిస్తామని ASF జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంవీ రమేష్ అన్నారు. బుధవారం జన్కాపూర్ సబ్ జైలు అధికారులతో సమావేశం నిర్వహించారు. జైలులో ఖైదీలకు కల్పిస్తున్న సౌకర్యాలు, వారి ఆరోగ్య వివరాలను స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఖైదీల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు.
News October 16, 2025
సంగారెడ్డి: 23 వరకు ఓపెన్ స్కూల్ అడ్మిషన్ గడువు పెంపు

ఓపెన్ స్కూల్ విధానంలో పది, ఇంటర్ అడ్మిషన్ గడువు ఈనెల 23వ తేదీ వరకు పెంచినట్లు ఉమ్మడి జిల్లా సమన్వయకర్త వెంకటస్వామి బుధవారం తెలిపారు. సమీపంలోని అధ్యయన కేంద్రాలు అడ్మిషన్ కోసం సంప్రదించాలని పేర్కొన్నారు. అడ్మిషన్ రుసుం మీసేవ కేంద్రాల్లో మాత్రమే చెల్లించాలని చెప్పారు. గడువు పెంపును సద్వినియోగం చేసుకోవాలని కోరారు.