News October 15, 2025
కష్టపడిన వారికే పదవులు దక్కుతాయి: ఎంపీ RRR

కాంగ్రెస్ పార్టీ విస్తరణకు కృషి చేసిన, కష్టపడిన వారికే పదవులు దక్కుతాయని ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి అభయమిచ్చారు. బుధవారం కొత్తగూడెంలో జరిగిన జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల ఎంపిక దరఖాస్తుల స్వీకరణలో మాట్లాడారు. ఎన్నికలకు ముందు పని చేసిన వారిని మర్చిపోమని, అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు ముందు కలిసికట్టుగా పనిచేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల కృషికి గుర్తింపు ఉంటుందని చెప్పారు.
Similar News
News October 17, 2025
చిత్తూరు: సెలవు రోజుల్లోనూ రిజిస్ట్రేషన్ సేవలు

చిత్తూరు జిల్లాలోని అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సెలవు రోజుల్లోనూ రిజిస్ట్రేషన్ సేవలను నిర్వహించనున్నట్లు జిల్లా రిజిస్ట్రార్ వెంకటరమణమూర్తి తెలిపారు. ఇందుకు రూ.5 వేలను ప్రత్యేక రిజిస్ట్రేషన్ ఫీజుగా చెల్లించాలన్నారు. ముందుగానే ఆన్‌లైన్‌లో స్లాట్ బుకింగ్ చేసుకుని, అవసరమైన పత్రాలతో కార్యాలయానికి రావాలని సూచించారు. ఈ అవకాశాన్ని జిల్లా వాసులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News October 17, 2025
అధికారులకు షోకాజ్ నోటీస్‌లు జారీ చేయండి: కలెక్టర్

గృహ నిర్మాణ ప్రగతిపై నిర్వహించిన సమావేశానికి హాజరుకాని ఐదుగురు అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని అధికారులను కలెక్టర్ వెట్రిసెల్వి గురువారం ఆదేశించారు. జిల్లాలో గృహ నిర్మాణాల లక్ష్యసాధనలతో అధికారులు కలిసికట్టుగా పనిచేసి మంచి ప్రగతిని సాధించాలన్నారు. లక్ష్యసాధనలో వెనుకబడిన అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. గృహ నిర్మాణంలో అలసత్వం వహించే కాంట్రాక్టులను తొలగించి కొత్తవారిని నియమించాలన్నారు.
News October 17, 2025
CBSLలో ఉద్యోగాలు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

కెనరా బ్యాంక్ సెక్యూరిటీస్ లిమిటెడ్(CBSL)ముంబై కార్పొరేట్ ఆఫీస్‌లో ట్రైనీ (అడ్మినిస్ట్రేషన్/ఆఫీస్ వర్క్) పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. డిగ్రీ అర్హతగల అభ్యర్థులు ఈమెయిల్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల వయసు 20 నుంచి 30ఏళ్ల మధ్య ఉండాలి. పని అనుభవం గలవారికి ప్రాధాన్యం ఉంటుంది. ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.canmoney.in/