News October 15, 2025

కొత్తగూడెం: కొనుగోలు కేంద్రాల వద్ద ఏర్పాట్లు చేయాలి

image

వానాకాలం ధాన్యం కొనుగోళ్ల పురోగతిపై మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు బుధవారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ పాల్గొన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు మౌలిక వసతులు, రవాణా సౌకర్యాలపై దృష్టి సారించాలని సూచించారు. రైతులు నిరీక్షించాల్సిన పరిస్థితి రాకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు.

Similar News

News October 16, 2025

నాగర్‌కర్నూల్: నూతన ఓటర్లకు గుర్తింపు కార్డులు తపాలా ద్వారా పంపిణీ

image

జిల్లాలో ఓటర్ల వివరాలను సక్రమంగా క్రమబద్ధీకరించేందుకు సమగ్ర చర్యలు చేపట్టబడుతున్నామని జిల్లా కలెక్టర్ బడావత్ సంతోష్ తెలిపారు. నూతనంగా నమోదైన ఓటర్లకు గుర్తింపు కార్డులను తపాలా శాఖ సహకారంతో పంపిణీ చేసే విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించామని పేర్కొన్నారు. ఈ చర్య ద్వారా ప్రతి ఓటరికి వారి ఓటరు గుర్తింపు కార్డు సురక్షితంగా, సమయానికి అందేలా చూడగలమని తెలిపారు.

News October 16, 2025

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక: తొలి ర్యాండమైజేషన్ పూర్తి

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కోసం ఈవీఎంలు, వీవీప్యాట్ల తొలి ర్యాండమైజేషన్ పూర్తయిందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి తెలిపారు. గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్ర పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఇది నిర్వహించారు. ఆయా పార్టీల నేతల సమక్షంలో స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచామన్నారు. జూబ్లీహిల్స్‌‌లో మొత్తం 407 పోలింగ్‌ కేంద్రాలకు 569 బ్యాలెట్ యూనిట్లు, 569 కంట్రోల్ యూనిట్లు, 610 వీవీప్యాట్లు కేటాయించారు.

News October 16, 2025

విద్యార్థులకు వ్యాసరచన పోటీలు: గద్వాల SP

image

పోలీస్ అమరవీరుల సంస్మరణ దినాన్ని పురస్కరించుకుని 6వ తరగతి నుంచి పీజీ విద్యార్థులకు రాష్ట్ర స్థాయి వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నట్లు గద్వాల ఎస్పీ శ్రీనివాసరావు గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఆన్‌లైన్ ద్వారా తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ భాషల్లో పోటీలు ఉంటాయన్నారు. వ్యాసాలు ఈనెల 28లోగా సమర్పించాలన్నారు. ముగ్గురిని రాష్ట్ర స్థాయికి ఎంపిక చేస్తామన్నారు. వివరాలకు 8712661828 నంబర్‌కు కాల్ చేయాలన్నారు.