News October 15, 2025
‘తెలంగాణ రైజింగ్ విజన్’లో పాల్గొనాలి: కలెక్టర్

కొత్తగూడెం: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘తెలంగాణ రైజింగ్ విజన్–2047’ సర్వేలో జిల్లాలోని ప్రతి ప్రభుత్వ ఉద్యోగి తప్పనిసరిగా పాల్గొనాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. అభివృద్ధి, సంక్షేమం, విద్య, ఆరోగ్యం, ఐటీ వంటి రంగాలలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెట్టే లక్ష్యంతో ఈ డాక్యుమెంట్‌ను రూపొందిస్తున్నట్లు ఆయన వివరించారు.
Similar News
News October 16, 2025
NRPT: ‘ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ఉత్తమ ఫలితాలు’

జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ఉత్తమ ఫలితాలు సాధిస్తుందని కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. గురువారం నారాయణపేటలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో హౌసింగ్ సిబ్బంది సమావేశం ఏర్పాటు చేసి వారిని అభినందిస్తూ అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్‌తో కలిసి జిల్లా కలెక్టర్ సన్మానించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం పేద ప్రజలకు గూడు కల్పించాలని ఈ పథకాన్ని ప్రారంభించిందని అన్నారు.
News October 16, 2025
జనగామ: పత్తి మద్దతు ధర పోస్టర్ ఆవిష్కరణ

ప్రభుత్వం సీసీఐ పత్తి కొనుగోళ్లకు సంబంధించిన మద్దతు ధర పోస్టర్‌ను జనగామ కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా గురువారం సంబంధిత అధికారులతో కలిసి ఆవిష్కరించారు. ప్రతి రైతు సీసీఐ కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధరకు పత్తిని విక్రయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్, వ్యవసాయ శాఖ అధికారిని అంబికా సోనీ, తదితరులు పాల్గొన్నారు.
News October 16, 2025
NGKL: ప్రభుత్వ డిగ్రీ పీజీ కళాశాలలో పీజీ విద్యార్థినికి గోల్డ్ మెడల్

పాలమూరు యూనివర్సిటీలో జరిగిన స్నాతకోత్సవ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ గవర్నమెంట్ డిగ్రీ పీజీ ఆర్ట్స్ & కామర్స్ కళాశాల విద్యార్థిని హేమలతకు 2023 సంవత్సరానికి గాను M.A ఎకనామిక్స్‌లో గోల్డ్ మెడల్ ప్రదానం చేశారు. కళాశాల ప్రిన్సిపల్ డా.గీతాంజలి, ఆర్థికశాస్త్ర విభాగాధిపతి వై.కృష్ణయ్య, విభాగ అధ్యాపకులు డా.ఆర్.కృష్ణ, Ch.సతీశ్, కళాశాల లెక్చరర్స్, విద్యార్థులు ఆమెను అభినందించారు.