News October 15, 2025

MNCL: కొడుకు మృతి.. తట్టుకోలేక ఫ్యామిలీ సూసైడ్

image

అల్లారుముద్దుగా పెంచుకున్న కుమారుడి మృతి తట్టుకోలేక కుటుంబీకులంతా ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన మంచిర్యాలలో జరిగింది. రాజీవ్ నగర్‌లో ఆటో డ్రైవర్ చక్రవర్తి కుమారుడు పవన్ 2నెలల క్రితం జ్వరంతో మృతిచెందాడు. దీంతో మనస్తాపం చెందిన కుటుంబీకులు ఈ నెల 5న పురుగుమందు తాగారు. ఈ నెల 9 అతడి భార్య దివ్య, 11న కూతురు దీక్షిత మృతి చెందగా బుధవారం చక్రవర్తి చనిపోయాడు.

Similar News

News October 17, 2025

KNR: తీవ్ర ఉద్రిక్తత నడుమ అభిప్రాయాల సేకరణ

image

KNR జిల్లా కాంగ్రెస్, నగర కాంగ్రెస్ అధ్యక్ష పదవుల నియామక ప్రక్రియలో భాగంగా ఏఐసీసీ పరిశీలకులు శ్రీనివాస్ మానే గురువారం ముఖ్య నేతల అభిప్రాయాలను సేకరించారు. పార్టీ కార్యాలయం వద్ద కార్యకర్తల ఆందోళనతో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నప్పటికీ, అభిప్రాయాల సేకరణ కొనసాగింది. కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ ముఖ్య నేతలు ఒక్కొక్కరుగా ప్రత్యేక గదిలోకి వెళ్లి పరిశీలకులకు తమ అభిప్రాయాన్ని తెలిపారు.

News October 17, 2025

భద్రాద్రి జిల్లాలో నేటి ముఖ్యాంశాలు..!

image

✓ కొత్తగూడెం ఎర్త్ సైన్స్ యూనివర్సిటీకి క్యాబినెట్ ఆమోదం
✓ చుంచుపల్లి: మద్యానికి బానిసై యువకుడి ఆత్మహత్య
✓ మత్తు పదార్థాలు నియంత్రించాలని ఇల్లందులో పోలీసుల ర్యాలీ
✓ అశ్వాపురం: అక్రమంగా ఇసుక రవాణా.. 9 మందిపై కేసు
✓ మణుగూరు: అశోక్ నగర్‌లో పోలీసుల కార్డెన్ సెర్చ్
✓ భద్రాచలం: గుండెపోటుతో ఆర్టీసీ కండక్టర్ మృతి
✓ బూర్గంపాడు: చెరువులో పడి వ్యక్తి మృతి
✓ జాతీయస్థాయిలో కరకగూడెం బిడ్డకు స్వర్ణం

News October 17, 2025

నర్సాపూర్: ముగ్గురు ఉపాధ్యాయులు సస్పెండ్

image

నర్సాపూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న ముగ్గురు ఉపాధ్యాయులను జిల్లా విద్యాధికారి డాక్టర్ రాధా కిషన్ సస్పెండ్ చేశారు. ఉన్నత పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఒక ప్రధానోపాధ్యాయుడు, ఇద్దరు ఉపాధ్యాయులు విధుల పట్ల నిర్లక్ష్యం వహించాలన్న సమాచారంతో విచారణ చేపట్టిన డీఈవో వారిని గురువారం సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు.