News October 15, 2025
సికింద్రాబాద్‌లో టెరిటోరియల్ ఆర్మీ రిక్రూట్‌మెంట్

సికింద్రాబాద్‌లోని AOC సెంటర్‌లోని థాపర్ స్టేడియంలో NOV 15 నుంచి DEC 1వరకు ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ నిర్వహించనున్నారు. 110 ఇన్ఫాంట్రీ బెటాలియన్( టెరిటోరియల్ ఆర్మీ), 117 ఇన్ఫాంట్రీ బెటాలియన్ ది గార్డ్స్, 125 ఇన్ఫాంట్రీ బెటాలియన్ ది గార్డ్స్‌లో సైనికుల కోసం ఈ ర్యాలీ జరుగుతుంది. టెన్త్ పాసై శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. ఆసక్తిగల అభ్యర్థులు https://www.ncs.gov.in/ను సంప్రదించవచ్చు.
Similar News
News October 17, 2025
TODAY HEADLINES

✦ ఏపీలో ప్రధాని మోదీ పర్యటన.. రూ.13,429 కోట్ల ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు
✦ మోదీతో ఇండియా ప్రతిష్ఠ ఎంతో పెరిగింది: CM CBN
✦ AIకు AP తొలి గమ్యస్థానంగా మారనుంది: మోదీ
✦ BC రిజర్వేషన్లపై TG ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
✦ ఈ నెల 18న TG బంద్‌కు మద్దతు ప్రకటించిన కాంగ్రెస్
✦ క్యాబినెట్ భేటీకి మంత్రి కొండా సురేఖ గైర్హాజరు
✦ AUSలో ప్రాక్టీస్ ఆరంభించిన రోహిత్, కోహ్లీ
News October 17, 2025
నగరాలను దాటి గ్రామాల దిశగా ‘ఆతిథ్యం’

‘ఆతిథ్యం’ అంటే నగరాల్లోని స్టార్ హొటళ్లు, దర్శనీయ స్థలాలు మాత్రమే అన్నట్లుండేది. ఇపుడా రంగం టైప్1 నగరాలను దాటి చిన్న పట్టణాల వైపు విస్తరిస్తోంది. HVS ANAROCK డేటా ప్రకారం JAN-APR మధ్య జరిగిన ఒప్పందాల్లో 73.3% టైర్2(31.6), టైర్3, 4(41.7) సిటీల్లో జరిగాయి. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే గణనీయమైన పెరుగుదల ఉంది. ప్రాంతీయ పండగలు, డెస్టినేషన్ వెడ్డింగ్స్, కార్పొరేట్ రీట్రీట్స్, సమ్మిట్స్‌తో కళకళలాడుతోంది.
News October 17, 2025
రోజుకు 5KM పరుగు… అయినా 2 స్టెంట్లు

రోజుకు 5 కి.మీ పరిగెత్తడం అతడి దినచర్య. నిద్ర, ఆహార నియమాలను తూ.చ పాటిస్తుంటాడు. 15 ఏళ్లుగా ఇదే పాటిస్తున్న కార్తీక్ శ్రీనివాసన్ అనే వ్యక్తి చేసిన ట్వీట్ వైరలవుతోంది. హఠాత్తుగా అస్వస్థత అనిపించడంతో యాంజియోగ్రామ్ చేస్తే హార్ట్‌లో 2 బ్లాక్స్ ఉన్నట్లు తేలిందని, స్టెంట్లు వేశారని ఆయన పేర్కొన్నాడు. జాగ్రత్తలు తీసుకున్నా గుండె లయ తప్పిందన్నాడు. గుండె ఆరోగ్యం అనేక అంశాలతో ముడిపడి ఉంటుందనుకోవాలన్నాడు.