News October 15, 2025

కామారెడ్డి: DCC అధ్యక్ష పదవికి దరఖాస్తు చేసుకున్న నారెడ్డి మోహన్ రెడ్డి

image

కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రామారెడ్డి జడ్పీటీసీ మాజీ సభ్యుడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు నారెడ్డి మోహన్ రెడ్డి బుధవారం దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు జిల్లా అబ్జర్వర్ రాజ్ పాల్‌కు దరఖాస్తును అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఆపత్కాలంలో పార్టీకి ఎనలేని సేవలు చేశానని, తన సేవలను గుర్తించి డీసీసీ పదవి లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Similar News

News October 17, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News October 17, 2025

శుభ సమయం (17-10-2025) శుక్రవారం

image

✒ తిథి: బహుళ ఏకాదశి మ.1.08 వరకు
✒ నక్షత్రం: మఖ సా.4.38 వరకు
✒ శుభ సమయం: ఉ.10.00-10.30
✒ రాహుకాలం: ఉ.10.30-మ.12.00
✒ దుర్ముహూర్తం: ఉ.8.24-ఉ.9.12, మ.12.24-మ.1.12
✒ వర్జ్యం: శే.ఉ.6.08 వరకు, రా.12.52-2.30
✒ అమృత ఘడియలు: మ.3.00-మ.4.36 * ప్రతిరోజూ పంచాంగం, <<-1>>రాశిఫలాలు<<>> కోసం క్లిక్ చేయండి.

News October 17, 2025

సిద్దిపేట: ఇబ్బందులు లేకుండా కొనుగోలు చేయండి: కలెక్టర్

image

ఖరీఫ్ 2025-26 సీజన్ వరిధాన్యం సులభంగా రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు ప్రక్రియ జరిగేలా మిల్లర్లు, అధికారులు పనిచేయాలని కలెక్టర్ కె.హైమావతి ఆదేశించారు. గురువారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని సమావేశ మందిరంలో రైస్ మిల్లర్ అసోసియేషన్ ప్రతినిధులు, జిల్లా సివిల్ సప్లై, డీఆర్డీఓ అధికారులులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు.