News October 15, 2025

విజయవాడలో ఉమ్మడి కృష్ణా జిల్లా కూటమి నేతల భేటీ

image

ఉమ్మడి కృష్ణా జిల్లా ప్రజాప్రతినిధులతో మంత్రి కొల్లు రవీంద్ర బుధవారం భేటీ అయ్యారు. విజయవాడ R&B గెస్ట్ హౌస్‌లో జరిగిన ఈ భేటీలో కార్పొరేషన్ ఛైర్మన్‌లు, పలువురు MLAలు హాజరయ్యారు. కల్తీ మద్యం కేసు తర్వాత జిల్లాలో నెలకొన్న రాజకీయ పరిణామాలపై చర్చించారు. కల్తీ మద్యం కేసులో ప్రభుత్వాన్ని అస్థిరపరిచే విధంగా YCP పన్నిన కుట్రపై కూటమి నేతలు చర్చించారు. YCP కుట్రలను సమర్ధవంతంగా తిప్పికొట్టాలని మంత్రి కోరారు.

Similar News

News October 17, 2025

విశాఖ సెంట్రల్ జైలుకు ఎచ్చెర్ల MPP

image

ఎచ్చెర్ల MPP చిరంజీవిని బుధవారం రాత్రి పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అతనిపై రెండేళ్లుగా 14 కేసులు నమోదయ్యాయని, అతను చెడు వ్యవసనాలతో ప్రజల పట్ల దురుసుగా ప్రవర్తిస్తుండడంతో అరెస్ట్ చేసినట్లు జిల్లా SP కేవీ మహేశ్వరరెడ్డి తెలిపారు. అతనిపై PD యాక్ట్ నమోదు చేయాలని ఎచ్చెర్ల పోలీసులు జిల్లా కార్యాలయానికి ప్రతిపాదనలు పంపించినట్లు తెలిపారు. నిందితుడిని విశాఖ సెంట్రల్ జైలుకు తరలించినట్లు తెలిపారు.

News October 17, 2025

అజిత్రోమైసిన్ సిరప్‌లో పురుగులు

image

మధ్యప్రదేశ్‌లో దగ్గు మందు మరణాల తర్వాత అజిత్రోమైసిన్ సిరప్‌లో పురుగులు రావడం కలకలం రేపుతోంది. గ్వాలియర్ జిల్లా మోరార్ ప్రభుత్వాస్పత్రిలో ఇచ్చిన అజిత్రోమైసిన్ యాంటీబయాటిక్ సిరప్‌లో పురుగులున్నాయని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆస్పత్రిలోని మిగిలిన 306 బాటిల్స్‌ను సీజ్ చేసి, టెస్ట్ కోసం శాంపిల్స్ భోపాల్ పంపారు. అది జనరిక్ మెడిసిన్ అని, MPలోని ఓ కంపెనీ తయారు చేస్తోందని అధికారులు వెల్లడించారు.

News October 17, 2025

విజయవాడ: విద్యార్థి మృతిపై అనుమానాలు

image

సింగ్ నగర్‌లో 9వ తరగతి విద్యార్థి యశ్వంత్ మృతిపై అనుమానాలు నెలకొన్నాయి. బాత్‌రూమ్‌లో 2 అడుగుల ఎత్తులో ఉన్న హ్యాంగర్‌కు ఉరి వేసుకున్నట్లు కనిపించడంపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా యశ్వంత్ పేరెంట్స్ విడిపోయారు. తల్లికి క్యాన్సర్‌ కావడంతో యశ్వంత్ స్కూల్‌కు సరిగా వెళ్లడం లేదు. చెల్లి దివ్యాంగురాలు. ఈ పరిణామాలతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడా? అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.