News October 15, 2025

తిరుపతిలో వైసీపీ నాయకుల నిరసన

image

సోషియల్ మీడియాలో ప్రశ్నించారని వైసీపీ నాయకులను అరెస్టు చేయడాన్ని ఆ పార్టీ ఖండించింది. తిరుపతిలో ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన నాయకులు బుధవారం నిరసన వ్యక్తం చేశారు. నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన పోలీసులు కూటమి ప్రభుత్వానికి వత్తాసుగా నిలుస్తున్నారని ఆరోపించారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, ఎంపీ గురుమూర్తి, నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌లు పాల్గొన్నారు.

Similar News

News October 16, 2025

CTR: 23 నుంచి స్కూల్లో ఆధార్ క్యాంపులు

image

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహించాలని రాష్ట్ర విద్యాశాఖ ఆదేశింది. ఈ మేరకు చిత్తూరు జిల్లాలో ఈనెల 23 నుంచి 30వ తేదీ వరకు గుర్తించిన స్కూల్లో ఆధార్ కార్డు శిబిరాలు నిర్వహిస్తామని డీఈవో వరలక్ష్మి ప్రకటించారు. విద్యార్థుల బయోమెట్రిక్ అప్‌డేట్ చేస్తామని చెప్పారు. మార్పులు, చేర్పులు సైతం చేసుకోవచ్చన్నారు.

News October 15, 2025

గూగుల్ రాకపై చిత్తూరు MP ఏమన్నారంటే..?

image

విశాఖలో గూగుల్ ఏర్పాటుతో డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు ఊతమస్తుందని చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాద్ రావు అన్నారు. నూతన ఆవిష్కరణలో సీఎం చంద్రబాబు ముందుంటారని కొనియాడారు. వికసిత భారత్‌లో ఆంధ్రప్రదేశ్ ముందడుగు వేస్తోందన్నారు. ఏపీ, గూగుల్ మధ్య ఒప్పందం చారిత్రాత్మకమని చెప్పారు. ఈ ఒప్పందంతో విశాఖపట్నం అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించిందన్నారు.

News October 15, 2025

CTR: రేపే LPG బాట్లింగ్ ప్లాంట్ ప్రారంభం

image

చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం ఎర్ర చెరువుపల్లి వద్ద LPG బాట్లింగ్ ప్లాంట్‌ ఏర్పాటు చేశారు. దీనిని ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ప్రారంభించనున్నారు. కర్నూలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభిస్తారని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రధానితో పాటు గవర్నర్, సీఎం, డిప్యూటీ సీఎం ఇతర మంత్రులు పాల్గొంటారు.