News October 15, 2025
MHBD: లిక్కర్ షాపులకు 168 దరఖాస్తులే!

జిల్లాలో ఉన్న 61 లిక్కర్ షాపులకు మొత్తం 168 దరఖాస్తులు వచ్చినట్లు మహబూబాబాద్ ఎక్సైజ్ సీఐ చిరంజీవి తెలిపారు. బుధవారం 44 మద్యం దరఖాస్తులు వచ్చాయన్నారు. ఇంకా 3 రోజులు మాత్రమే ఉందన్నారు. మద్యం దరఖాస్తులు ఈనెల 18వ తేదీతో గడువు ముగుస్తుందని మహబూబాబాద్ ఎక్సైజ్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ చిరంజీవి తెలిపారు.
Similar News
News October 17, 2025
ఎన్ని ఉద్యోగాలొస్తాయో గూగుల్‌లోనే సెర్చ్ చేయండి: గుడివాడ

విశాఖలో గూగుల్ ద్వారా 1.88 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని మంత్రి లోకేశ్ ప్రకటనలు చేస్తున్నారని.. కానీ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న గూగుల్ ఉద్యోగులే 1.87 లక్షల మంది అని మాజీమంత్రి అమర్నాథ్ తెలిపారు. ఒక గిగావాట్ డేటా సెంటర్ వలన ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయో గూగుల్‌లోనే సెర్చ్ చేయండని ఎద్దేవా చేశారు. US బోర్డర్ ఎలాస్పాలో మెటా డేటా సెంటర్‌లో 100-150 మందికి ఉద్యోగం కల్పిస్తున్నట్లు ఆ సంస్థ ప్రకటించిందన్నారు.
News October 17, 2025
రేపటి బంద్‌లో అందరూ పాల్గొనాలి: భట్టి

TG: BCలకు రిజర్వేషన్లపై నిర్వహించే బంద్‌లో అందరూ పాల్గొనాలని Dy.CM భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. ‘BRS రిజర్వేషన్లను 50%కి పరిమితం చేసి BC కోటాను తగ్గించింది. మేం సైంటిఫిక్ సర్వే లెక్కల ప్రకారం 42% కల్పించాం. బిల్లును ఆమోదించి పంపినా కేంద్రం ఆమోదించడం లేదు. అందుకే రిజర్వేషన్ల పెంపు కోర్టుల్లో నిలిచిపోతోంది. BJP నైజం బయటపడింది. వారిప్పుడు మాయమాటలు చెప్పినా ప్రజలు నమ్మరు’ అని భట్టి అన్నారు.
News October 17, 2025
HYD: నిమ్స్‌లో అనస్థీషియా విద్యార్థి అనుమానాస్పద మృతి

పంజాగుట్ట నిమ్స్ ఆస్పత్రిలో అనస్థీషియా వైద్య విద్యార్థి నితిన్ అనుమానాస్పద మృతి చెందాడు. నిన్న రాత్రి విధులకు హాజరుకాగా.. ఇవాళ ఉదయం ఆపరేషన్ థియేటర్లో విగతజీవిగా పడి ఉన్నాడు. ఆస్పత్రి సిబ్బంది సమాచారంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అనుమానాస్పద మృతి పట్ల పోలీసులు సీసీ ఫుటేజీ పరిశీలిస్తున్నారు.