News October 15, 2025
అన్నవరం విషయంలో ఎమ్మెల్యేల మధ్య ఆధిపత్య పోరు..?

అన్నవరం ఆలయం విషయంలో తుని, ప్రత్తిపాడు MLAల మధ్య ఆధిపత్య పోరు నెలకొందని చర్చ సాగుతోంది. తుని ఎమ్మెల్యే యనమల దివ్య సిఫారుసులతో సుబ్బారావును ఈవోగా నియమించారని టాక్. అప్పటి నుంచి ఆలయంలో సత్యప్రభ కంటే దివ్య మాటే చెల్లుబాటవుతుందని ఆమె అనుచరులు ఆరోపిస్తున్నారు. లోకల్ MLA ఉండగా దివ్య పెత్తనం చేయడం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. చివరికి ఈ వ్యవహారం ఈవోను బదిలీ చేయించేదాకా వెళ్లిందని ప్రచారం సాగుతోంది.
Similar News
News October 17, 2025
విశాఖ: రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి

ఆరిలోవ BRTS రోడ్డులో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. విజయనగరం (D)కి చెందిన వినయ్ పురుషోత్తపురంలో ఉంటూ విశాఖలోని ఓ కాలేజీలో చదువుతున్నాడు. స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్లాడు. వినయ్ తన మిత్రుడు ఉదయ్‌తో తిరిగొస్తుండగా బైక్ అదుపుతప్పి డివైడర్‌ని ఢీకొంది. ఈ ప్రమాదంలో వినయ్ తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఉదయ్ చికిత్స్ పొందుతున్నాడు.
News October 17, 2025
విజయవాడ: నైపుణ్య కోర్సులలో యువతకు ఫ్రీ కోచింగ్

నున్నలోని సీడాప్ శిక్షణ కేంద్రంలో హోటల్ మేనేజ్‌మెంట్, టాలీ, టెక్నిషియన్, సాఫ్ట్ స్కిల్స్‌లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు శిక్షణ అధికారి ధనలక్ష్మి తెలిపారు. SSC ఆపైన చదివి 18- 30 ఏళ్లలోపువారు ఈ శిక్షణలో చేరవచ్చని..ఉచిత హాస్టల్, భోజన సదుపాయం కల్పిస్తామన్నారు. శిక్షణ అనంతరం సర్టిఫికెట్ ఇచ్చి ఉపాధి కల్పిస్తామని..వివరాలకు 8142602179 నెంబరులో సంప్రదించాలని ఆమె సూచించారు.
News October 17, 2025
హెల్మెట్ వాడకం తప్పనిసరి: ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్

ప్రపంచ ట్రామా డే సందర్భంగా ఏలూరులోని ఆశ్రమం ఆసుపత్రిలో శుక్రవారం హెల్మెట్ వాడకంపై ప్రత్యేక ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీని జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ జెండా ఊపి ప్రారంభించారు. ఎస్పీ మాట్లాడుతూ.. ద్విచక్ర వాహన ప్రమాదాల్లో ప్రాణాపాయానికి ముఖ్య కారణం హెల్మెట్ ధరించకపోవడమేనని విచారం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ వాడాలని ఆయన కోరారు.