News October 15, 2025

సీఎంఆర్ సమర్పించిన వారికే ధాన్యం: వనపర్తి కలెక్టర్

image

గత ఖరీఫ్ సీజన్ 2024-25లో వరి ధాన్యం పొందిన వారిలో వంద శాతం CMR సమర్పించిన వారికే ఖరీఫ్ 2025-26 సీజన్ ధాన్యం కేటాయిస్తామని కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. బుధవారం NIC కాన్ఫరెన్స్ హాల్‌లో అదనపు కలెక్టర్ కీమ్యా నాయక్‌తో కలిసి రైస్ మిల్లర్లతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. నవంబర్ 12లోపు పెండింగ్ సీఎంఆర్ పూర్తి చేసి కొత్త ధాన్యం పొందడానికి సహకరించాలని రైస్ మిల్లర్లకు సూచించారు.

Similar News

News October 16, 2025

MHBD: పత్తి రైతుకు తిప్పలు తప్పవా..!

image

పత్తిని అమ్ముకోవాలంటే రైతులు కపాస్ కిసాన్ యాప్‌లో స్లాట్ బుకింగ్ తప్పనిసరి చేయడంతో పత్తి రైతుకు కొత్త ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్లు లేని, చదువు రాని రైతులకు ఈయాప్ వాడటం కష్టంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతులకు యాప్‌పై అవగాహన సదస్సులను నిర్వహించాలని,అకాల వర్షాలకు భారీగా పత్తి పంటలు దెబ్బతిన్నాయని, పండిన కొద్దిపాటి పత్తిని అమ్ముకోవడానికి రైతులకు ఇబ్బందిగా మారింది.

News October 16, 2025

మెదక్: 49 మద్యం దుకాణాలు.. 276 దరఖాస్తులు

image

మెదక్ జిల్లాలోని మొత్తం 49 మద్యం దుకాణాలకు బుధవారం వరకు 276 దరఖాస్తులు వచ్చినట్లు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి జి.శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈనెల 18 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. మద్యం దుకాణాలు ఎస్సీ, ఎస్టీ, గౌడ్‌లకు రిజర్వేషన్ కేటాయించినట్లు తెలిపారు. సకాలంలో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.

News October 16, 2025

రూ.13,429 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు

image

కర్నూలు జిల్లాలో ప్రధాని మోదీ భారీ ఎత్తున ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాలను చేపట్టనున్నారు. మొత్తంగా రూ.13,429 కోట్ల మేర అభివృద్ధి పనులకు మోదీ శ్రీకారం చుట్టనున్నారు. వీటిల్లో రూ.9,449 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపనలు చేయనుండగా.. రూ.1,704 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. రూ.2,276 కోట్ల విలువైన ప్రాజెక్టులను జాతికి అంకితం చేస్తారు.