News October 15, 2025
మహిళల అభ్యున్నతికి ప్రణాళిక రూపొందించాలి: కలెక్టర్

భద్రాచలం ఐటీడీఏ కార్యాలయాన్ని కలెక్టర్ జితేష్ వి పాటిల్, ప్రాజెక్ట్ అధికారి రాహుల్, సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠతో కలిసి బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు ఎన్‌ఆర్‌సీ, నాయకపోడు మాస్కుల తయారీ కేంద్రం, గిరిజన భవనం, గిరి బజార్‌లను పరిశీలించారు. ఐటీడీఏ భవనాలలో గిరిజన మహిళలకు సంక్షేమ పథకాలు, కల్చరల్ పెయింటింగ్, ఇతర అంశాలపై శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్ సూచించారు.
Similar News
News October 16, 2025
SRD: NMMSకు దరఖాస్తు గడువు పొడిగింపు

నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ ఉపకార వేతనాలకు దరఖాస్తు గడువును ఈనెల 18 వరకు పొడిగించినట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదివే విద్యార్థులు https://bse.telangana.gov.inలో దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. ఎంపికైన వారికి నెలకు రూ.1000 చొప్పున నాలుగేళ్లు ఉపకార వేతనం అందిస్తారని పేర్కొన్నారు.
News October 16, 2025
బీర్ బాటిళ్లకూ బార్ కోడ్ పెట్టండి: చంద్రబాబు

AP: రాష్ట్రంలో ఎక్సైజ్ సురక్షా యాప్‌ను ఇప్పటివరకు 27 వేల మందికి పైగా డౌన్‌లోడ్ చేసుకున్నట్లు అధికారులు CM చంద్రబాబుకు తెలిపారు. యాప్ స్కాన్ ద్వారా చేస్తున్న విక్రయాల్లో ఒక్క నకిలీ మద్యం బాటిల్ కూడా వెలుగు చూడలేదన్నారు. మరింత పకడ్బందీగా వ్యవస్థను తయారు చేయాలని CM ఆదేశించారు. త్వరలో బీర్ బాటిళ్లకు కూడా బార్‌కోడ్ పెట్టాలని తెలిపారు. ఫిర్యాదుల కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని సూచించారు.
News October 16, 2025
వరంగల్: 78 పీఎంశ్రీ స్కూళ్లకు నిధులు!

బాలకల సాధికారత, బాలికల కౌమర దశ భద్రతా క్లబ్‌లను ఏర్పాటు చేస్తున్న ఆయా పీఎంశ్రీ పాఠశాలలకు రూ.15 వేల చొప్పున మంజూరు చేశారు. ఉమ్మడి జిల్లాలో 78 స్కూల్స్ సెలెక్ట్ అయ్యాయి. నిధులు ఎలా వినియోగించుకోవాలో ఆ పాఠశాలల HMలకు సమాచారం అందించారు. ఈ నెల 15 వరకు క్లబ్ ఏర్పాటు నివేదికను సమర్పించాలి. పీటీఎం సమావేశాల్లో ఈ అంశాన్ని చర్చించాల్సింటుంది. కలెక్టర్ ఆధ్వర్యంలో లైన్ డిపార్టుమెంట్లతో సమన్వయం జరగాల్సి ఉంది.