News April 8, 2024
నేను గొడ్డు మాంసం తినను: కంగన

తాను గొడ్డు మాంసం తింటానని వస్తున్న వార్తల్లో నిజం లేదని బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ అభ్యర్థి కంగనా రనౌత్ స్పష్టం చేశారు. ‘గొడ్డు మాంసం లేదా మరే విధమైన రెడ్ మీట్ తినను. నాపై రూమర్స్ చేయడం సిగ్గుచేటు. నేను దశాబ్దాలుగా యోగ, ఆయుర్వేద జీవన విధానాన్ని ప్రచారం చేస్తున్నాను. నా ప్రజలకు నేనేంటో తెలుసు. నేను గర్వించదగిన హిందువునని దేశ ప్రజలకు తెలుసు. జైశ్రీరామ్’ అని కంగన ట్వీట్ చేశారు.
Similar News
News April 9, 2026
IPL: టాస్ గెలిచిన LSG

ఈడెన్ గార్డెన్స్ వేదికగా KKRతో జరుగుతున్న మ్యాచులో LSG టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. అస్వస్థత కారణంగా పంజాబ్‌తో మ్యాచ్‌కు దూరమైన సునీల్ నరైన్ కోల్‌కతా జట్టులో చేరారు.
KKR: రహానే, అలెన్, గ్రీన్, రఘువంశీ, రింకూ, రమణ్‌దీప్, అనుకుల్ రాయ్, పావెల్, నరైన్, సైనీ, త్యాగి
LSG: మార్ష్, మార్క్రమ్, పంత్, పూరన్, సమద్, ముకుల్ చౌదరి, సిద్ధార్థ్, అవేశ్ ఖాన్, షమీ, దిగ్వేశ్, ప్రిన్స్ యాదవ్
News April 9, 2026
నాడు KCRను ఓడించాలనుకొని.. నేడు ఆయన బాటలోకి!

ఒకనాటి ప్రత్యర్థులను త్వరలో మిత్రులుగా చూడబోతున్నాం. 2008 కరీంనగర్ లోక్‌సభ ఉపఎన్నికలో పోటీపడ్డ KCR, <<19608778>>జీవన్ రెడ్డి<<>> ఒకే పార్టీలో కనిపించనున్నారు. ఆ ఎలక్షన్స్‌లో TRS అధినేతకు ఆయన గట్టిపోటీ ఇచ్చారు. KCRకు 2,69,452 ఓట్లు, జీవన్ రెడ్డికి 2,53,687 ఓట్లు వచ్చాయి. TG రాష్ట్ర ఏర్పాటుపై కాంగ్రెస్ స్పష్టమైన నిర్ణయం తీసుకోవట్లేదని ప్రజాభిప్రాయ నిరూపణకు MPగా ఉన్న KCR రిజైన్ చేయడంతో ఉపఎన్నిక జరిగింది.
News April 9, 2026
ఈ ఆలయాల్లోకి పురుషులకు నో ఎంట్రీ

శబరిమలలో మహిళలకు ఎంట్రీ నిషేధంపై కేసు విచారణ సందర్భంగా 7 ఆలయాల్లో పురుషులకూ అనుమతి లేదని కేంద్రం SCకి చెప్పింది. కొన్ని సందర్భాల్లో వీటిలోకి పురుషులకు ప్రవేశం ఉండదు. అట్టుకల్ భగవతీ టెంపుల్, చక్కులతుకవు టెంపుల్, కొట్టన్‌కులంగరా శ్రీదేవి టెంపుల్-కేరళం, బ్రహ్మ టెంపుల్-రాజస్థాన్, భగవతి అమ్మన్ టెంపుల్-కన్యాకుమారి(తమిళనాడు), మాతా టెంపుల్-ముజఫర్‌పూర్(బిహార్), కామాఖ్య టెంపుల్-అస్సాం.


