News October 16, 2025
గద్వాల్: ‘అక్రమంగా మట్టి తరలిస్తున్నా పట్టించుకోని అధికారులు’

జోగులాంబ గద్వాల్ జిల్లా కేంద్రంలో మట్టి దందా ఆగడం లేదు. పట్టపగలే అక్రమంగా మట్టిని తవ్వి తరలిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. కొందరు ట్రాక్టర్‌ను ఆపి డ్రైవర్‌ను అడగగా రాజకీయ పార్టీ నాయకుల పేర్లు చెప్పాడు. రాజకీయ నాయకుల అండతో అక్రమ దందా జోరుగా సాగుతోంది. కలెక్టర్ స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
Similar News
News October 16, 2025
మీరు కూడా సినిమా మీదే బతుకుతున్నారు: బన్నీ వాసు

టికెటింగ్ సంస్థ బుక్ మై షో సంస్థపై టాలీవుడ్ నిర్మాత బన్నీవాసు అసహనం వ్యక్తం చేశారు. వారి యాప్, సైట్‌లో సినిమాలకు అసలు రేటింగ్స్ ఎందుకని ప్రశ్నించారు. ‘జర్నలిస్టులు నిర్మాణాత్మక రివ్యూలు ఇస్తున్నారు కదా. మరి మీ రేటింగ్స్‌తో పనేముంది. అసలు సినిమా టికెట్ కొనే సమయంలో ఈ మూవీ బాగుంది, ఇది బాలేదు అని రేటింగ్ ఇవ్వడమేంటి? మీరు కూడా సినిమా మీదే బతుకుతున్నారని గుర్తు పెట్టుకోండి’ అని తెలిపారు.
News October 16, 2025
KNR: వ్యాధితో తల్లి.. గుండెపోటుతో తండ్రి దూరం..!

తల్లిదండ్రులు లేని అనాథగా మిగిలాడు చొప్పదండి మండలం రాగంపేటకు చెందిన దీకొండ స్వాద్విన్ కుమార్. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న బాలుడి తల్లి మూడేళ్ల క్రితం ఊపిరితిత్తుల వ్యాధితో మరణించగా తండ్రి ఆదివారం గుండెపోటుతో దూరమయ్యాడు. ఈ క్రమంలో బాలుడి దయనీయ స్థితిని చూసిన రాగంపేట గ్రామస్థులు కంటతడి పెడుతూ.. ప్రభుత్వం, స్వచ్ఛంద సేవా సంస్థలు అతడిని చేరదీసి చదివించాలని కోరుతున్నారు.
News October 16, 2025
నచ్చిన ఫుడ్ ఇష్టమొచ్చినట్లు తినేస్తున్నారా?

చాలామంది ఫుడ్ విషయంలో కాంప్రమైజ్ కారు. నచ్చిన టిఫిన్ అనో, నాన్ వెజ్ కూరనో ఆకలితో సంబంధం లేకుండా పరిమితికి మించి లాగించేస్తుంటారు. కొందరైతే ఫేవరెట్ ఫుడ్ కనిపిస్తే ఇష్టమొచ్చినట్లు తినేస్తారు. అలాంటి వాళ్లు ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి. ‘ఆహారం మితంగా తింటేనే ఆరోగ్యం.. అతిగా తింటే ఆయుక్షీణం’. అందుకే టిఫిన్, లంచ్, బ్రేక్ ఫాస్ట్ ఏదైనా కంట్రోల్డ్‌గా తీసుకోండి. ఇవాళ ప్రపంచ ఆహార దినోత్సవం.