News October 16, 2025
ఈనెల 25నాటికి ఈ-పంట నమోదు పూర్తి చేయాలి: జేసీ

బాణాసంచా తయారీ కేంద్రాలలో తనిఖీలు నిర్వహించాలని అనకాపల్లి జిల్లా జేసీ ఎం.జాహ్నవి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో అధికారులతో జేసీ మాట్లాడారు. బాణాసంచా తయారీ కేంద్రాల్లో భద్రతా లోపాలను గుర్తించాలన్నారు. ఓటర్ లిస్టులకు సంబంధించి వెరిఫికేషన్ పూర్తి చేసి మ్యాపింగ్ పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.
Similar News
News October 16, 2025
రేవంత్‌పై ACB కేసు చట్టవిరుద్ధం: రోహత్గీ

‘ఓటుకు నోటు’ కేసులో నిందితులు రేవంత్, సండ్ర వీరయ్య దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు విచారించింది. రేవంత్‌పై ACB కేసు చట్టవిరుద్ధమని ఆయన తరఫు న్యాయవాది రోహత్గీ పేర్కొన్నారు. FIR నమోదవ్వకముందే ఉచ్చు పన్ని కేసు పెట్టడం అన్యాయమన్నారు. ACB సెక్షన్ల ప్రకారం లంచం తీసుకోవడం మాత్రమే నేరమని వాదించారు. జస్టిస్ మహేశ్వరి, జస్టిస్ విజయ్ బిష్ణోయ్ ధర్మాసనం ఈ కేసును విచారించింది. రేపు కూడా విచారణ కొనసాగనుంది.
News October 16, 2025
మీరు కూడా సినిమా మీదే బతుకుతున్నారు: బన్నీ వాసు

టికెటింగ్ సంస్థ బుక్ మై షో సంస్థపై టాలీవుడ్ నిర్మాత బన్నీవాసు అసహనం వ్యక్తం చేశారు. వారి యాప్, సైట్‌లో సినిమాలకు అసలు రేటింగ్స్ ఎందుకని ప్రశ్నించారు. ‘జర్నలిస్టులు నిర్మాణాత్మక రివ్యూలు ఇస్తున్నారు కదా. మరి మీ రేటింగ్స్‌తో పనేముంది. అసలు సినిమా టికెట్ కొనే సమయంలో ఈ మూవీ బాగుంది, ఇది బాలేదు అని రేటింగ్ ఇవ్వడమేంటి? మీరు కూడా సినిమా మీదే బతుకుతున్నారని గుర్తు పెట్టుకోండి’ అని తెలిపారు.
News October 16, 2025
KNR: వ్యాధితో తల్లి.. గుండెపోటుతో తండ్రి దూరం..!

తల్లిదండ్రులు లేని అనాథగా మిగిలాడు చొప్పదండి మండలం రాగంపేటకు చెందిన దీకొండ స్వాద్విన్ కుమార్. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న బాలుడి తల్లి మూడేళ్ల క్రితం ఊపిరితిత్తుల వ్యాధితో మరణించగా తండ్రి ఆదివారం గుండెపోటుతో దూరమయ్యాడు. ఈ క్రమంలో బాలుడి దయనీయ స్థితిని చూసిన రాగంపేట గ్రామస్థులు కంటతడి పెడుతూ.. ప్రభుత్వం, స్వచ్ఛంద సేవా సంస్థలు అతడిని చేరదీసి చదివించాలని కోరుతున్నారు.