News April 8, 2024
REWIND: మాచర్లలో 80 ఓట్ల మెజార్టీతో MLA

మాచర్లలో 1967 ఎన్నికల్లో 80 ఓట్ల మెజారిటీతో వెన్న లింగారెడ్డి ఎమ్మెల్యే అయ్యారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఈయన జూలకంటి నాగిరెడ్డిని ఓడించారు. ఈ నియోజకవర్గంలో ఇదే ఇప్పటి వరకు అత్యల్ప మెజారిటీ. మరోవైపు, ఇదే నియోజకవర్గంలో పి. లక్ష్మారెడ్డిది అత్యధిక మెజారిటీ. (2004లో 30,666). తాజా ఎన్నికల్లో వైసీపీ నుంచి పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి, కూటమి నుంచి జూలకంటి బ్రహ్మనందరెడ్డి పోటీ పడుతున్న విషయం తెలిసిందే.
Similar News
News January 15, 2026
కోడి పందెం శాస్త్రం.. వారానికి ఒక రంగు

కోడి పందేలలో వారాన్ని బట్టి రంగులకు, రోజును బట్టి దిశలకు ప్రాధాన్యం ఉందని పందెం రాయుళ్లు నమ్ముతారు.
ఆది, మంగళవారాల్లో డేగ రంగు కోళ్లు, సోమ, శనివారాల్లో నెమలి రంగు కోళ్లు, బుధ, గురువారాల్లో కాకి రంగు కోళ్లు గెలుపు సాధిస్తాయని అంచనా. అలాగే బరిలో కోడిని దింపే దిశ కూడా కీలకం. భోగి నాడు ఉత్తర దిశ నుంచి, సంక్రాంతి నాడు తూర్పు దిశ నుంచి, కనుమ నాడు దక్షిణ దిశ నుంచి వదిలితే విజయం వరిస్తుందని శాస్త్రం.
News January 15, 2026
GNT: జీఎంసీ నేటి సంక్రాంతి సంబరాలు ఇవే!

గుంటూరు నగరపాలక సంస్థ నిర్వహిస్తున్న సంక్రాంతి సంబరాల్లో భాగంగా గురువారం అనేక సాంస్కృతిక కార్యక్రమాలు జరగనున్నాయి. తూర్పు నియోజకవర్గంలోని వెల్ఫేర్ స్థలంలో ఉదయం 9 గంటల నుంచి పొంగళ్లు, కోడి పందేలు, కర్రసాము, ఖోఖో, సాయంత్రం 5 గంటల నుంచి సాంప్రదాయ వస్త్రధారణ, మ్యూజికల్ నైట్, మిమిక్రి, బహుమతుల ప్రదానం జరగనుంది. అదేవిధంగా పశ్చిమ నియోజకవర్గం NTR స్టేడియంలో సాయంత్రం 5 గంటల నుంచి మ్యూజికల్ నైట్ ఉంటుంది.
News January 15, 2026
సరస్ ప్రదర్శనలో సమర్థవంతంగా పనిచేయాలి: కలెక్టర్

సరస్ ప్రాంగణంలో సందర్శకుల రద్దీని దృష్టిలో పెట్టుకొని విధులు కెటాయించిన అధికారులు పటిష్టమైన ప్రణాళికతో బాధ్యతగా పనిచేయాలని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. నల్లపాడు రోడ్డులోని జరుగుతున్న సరస్ ప్రదర్శనను బుధవారం సాయంత్రం కలెక్టర్ పరిశీలించారు. ప్రాంగణంలో స్టాల్స్, కంట్రోల్ రూమ్, ఫుడ్ కోర్ట్, ఎమ్యూజ్మెంట్ పార్క్ను కలెక్టర్ సందర్శించి అధికారులకు పలు సూచనలు చేశారు.


