News April 8, 2024

HYD: టీ-హబ్‌ వినూత్న కార్యక్రమం

image

స్టార్టప్‌లతో యువతరాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో టీ-హబ్‌ వినూత్న కార్యక్రమాలు చేపడుతోంది. తాజాగా యంగ్‌ ఎకో స్టార్టప్స్‌ కాన్‌ప్లుయెన్స్‌ పేరుతో ఈనెల 28, 29 తేదీల్లో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనుంది. సెంటర్‌ ఫర్‌ గ్లోబల్‌ అఫైర్స్‌ అండ్‌ పబ్లిక్‌ పాలసీ సహకారంతో ప్రోగ్రామ్‌ను నిర్వహిస్తున్నామని టీ హబ్‌ నిర్వాహకులు తెలిపారు. ఆసక్తి ఉన్నవారు https://bit.ly/3U2WKGr దరఖాస్తు చేసుకోవాలన్నారు.

Similar News

News September 11, 2025

HYD: హైకోర్టులో నల్లా బాలుకు ఊరట.. KTR హర్షం

image

సోషల్ మీడియా యాక్టివిస్ట్ నల్లా బాలుపై కాంగ్రెస్ పెట్టిన 3 కేసులను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. ఈ తీర్పుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ‘ఇది ప్రజాస్వామ్యానికి లభించిన విజయం. కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టు. రాజకీయ ప్రేరేపిత కేసులతో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను వేధించడం ఆపాలి’ అని డీజీపీని కోరారు. కేసులో విజయం సాధించినందుకు బీఆర్ఎస్ లీగల్ సెల్‌కు అభినందనలు తెలిపారు.

News September 11, 2025

HYD: ‘రోడ్డు ప్రమాదాల్లో తెలంగాణది 8వ స్థానం’

image

రోడ్డు ప్రమాదాల్లో జాతీయ స్థాయిలో తెలంగాణ 8వ స్థానంలో, మరణాల్లో 10వ స్థానంలో ఉందని సీఎస్ రామకృష్ణారావు అన్నారు. బుధవారం సుప్రీంకోర్టు కమిటీ ఛైర్మన్ అభయ్ మనోహర్ సప్రే, తెలంగాణ అధికారులతో రోడ్డు భద్రతపై సమావేశం నిర్వహించారు. హెల్మెట్లు, సీట్ బెల్టులు ధరించకపోవడం, మద్యం తాగి వాహనాలు నడపడం, మొబైల్ ఫోన్ వాడకం, అతివేగం వంటి ప్రధాన కారణాలుగా గుర్తించామన్నారు. అవగాహన కార్యక్రమాలు పెంచాలన్నారు.

News September 11, 2025

HYD: మియాపూర్‌లో CMR షాపింగ్ మాల్ ప్రారంభం

image

HYD మియాపూర్ డివిజన్ పరిధిలో బుధవారం సినీ నటి మృణాల్ ఠాకూర్ సందడి చేశారు. CMR షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. స్థానిక ఎమ్మెల్యే అరికపూడి గాంధీతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు. హీరోయిన్ మృణాల్ ఠాకూర్‌తో సెల్ఫీ దిగేందుకు ఫ్యాన్స్ ఎగబడ్డారు. మృణాల్ ఠాకూర్‌ను చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు రావడంతో స్థానికంగా సందడి నెలకొంది.