News October 16, 2025
MNCL: ఈ నెల 17న మినీ జాబ్ మేళా

నిరుద్యోగ యువతకు ఈ నెల 17న మినీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి రవికృష్ణ తెలిపారు. మెరీనా ప్లాంట్స్ లిమిటెడ్ ఆధ్వర్యంలో 2190 పోస్టులకు మేళ నిర్వహిస్తున్నారు. పది, ITI, డిగ్రీ, ఎంబీఏ
చేసి 18 నుంచి 40 ఏళ్ల లోపు వారు అర్హులన్నారు. సీవీ రామన్ డిగ్రీ కళాశాలలో ఇంటర్వ్యూలు ఉంటాయని వెల్లడించారు. యువత ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.
Similar News
News October 16, 2025
ఏసీబీకి చిక్కిన అవినీతి అధికారులు

ఏసీబీ ముమ్మర దాడులు నిర్వహిస్తున్నా కొందరు అధికారుల్లో మార్పు రావడం లేదు. బుధవారం అనంతపురంలోని జెడ్పీ పరిషత్ క్యాంపస్‌లో సీనియర్ ఆడిటర్ లక్ష్మీనారాయణ, అటెండర్ నూర్ అక్రమ సంపాదన బాగోతం బట్టబయలైంది. లక్ష్మీనారాయణ రూ.10 వేలు, నూర్ రూ.8 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
News October 16, 2025
జనగామ: టార్గెట్ నంబర్ 1.. విజయోస్తు 2.0 అమలు!

పదో తరగతి పరీక్ష ఫలితాల్లో జనగామ జిల్లా మూడేళ్లుగా చక్కటి ఫలితాలు సాధించింది. గతేడాది విజయోస్తు-1 ద్వారా ప్రత్యేక పఠన ప్రణాళిక రూపొందించడంతో రాష్ట్ర స్థాయిలో జిల్లా మూడో స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. ఐతే ఈసారి కలెక్టర్ రిజ్వాన్ బాషా రాష్ట్ర స్థాయిలో నంబర్ 1 లక్ష్యంగా విజయోస్తు 2.0 ద్వారా ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తున్నారు. తరగతుల సరళిపై నిత్యం ఆరా తీస్తున్నారు.
News October 16, 2025
పెళ్లి కాకుండా దత్తత తీసుకోవచ్చా?

హిందూ దత్తత, భరణం చట్టం 1956 ప్రకారం అవివాహిత స్త్రీలు, మానసికస్థితి బావున్నవారు, మేజర్లు, పెళ్లయినా భర్త వదిలేసినవాళ్లు లేదా భర్త చనిపోయినవాళ్లు, భర్త ఏడేళ్లకు పైగా కనిపించకుండా పోయినవాళ్లు, భర్తకు మతిస్థిమితం లేదని కోర్టు ద్వారా నిరూపితమైన సందర్భాల్లో స్త్రీలు దత్తత తీసుకోవడానికి అర్హులు. సెక్షన్-11 ప్రకారం అబ్బాయిని దత్తత తీసుకోవాలంటే మీకు పిల్లాడికి మధ్య 21 ఏళ్లు తేడా ఉండాలి.