News October 16, 2025

సంగారెడ్డి: 23 వరకు ఓపెన్ స్కూల్ అడ్మిషన్ గడువు పెంపు

image

ఓపెన్ స్కూల్ విధానంలో పది, ఇంటర్ అడ్మిషన్ గడువు ఈనెల 23వ తేదీ వరకు పెంచినట్లు ఉమ్మడి జిల్లా సమన్వయకర్త వెంకటస్వామి బుధవారం తెలిపారు. సమీపంలోని అధ్యయన కేంద్రాలు అడ్మిషన్ కోసం సంప్రదించాలని పేర్కొన్నారు. అడ్మిషన్ రుసుం మీసేవ కేంద్రాల్లో మాత్రమే చెల్లించాలని చెప్పారు. గడువు పెంపును సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Similar News

News October 16, 2025

మేడారం పనులు R&Bకి బదిలీ

image

TG: మేడారం టెండర్లపై మంత్రుల మధ్య <<18018400>>వివాదం<<>> వేళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ పనులను ప్రభుత్వం దేవాదాయ శాఖ నుంచి R&B శాఖకు బదిలీ చేసింది. దేవాదాయ శాఖకు పనులను పర్యవేక్షించే సాంకేతికత లేదని, పనుల స్వభావం, నాణ్యత, నిర్ణీత సమయంలో పూర్తి చేయడం వంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. రికార్డులను R&Bకి అప్పగించాలని ఆదేశించింది. కొండా సురేఖ ఎండోమెంట్ మంత్రిగా ఉన్నారు.

News October 16, 2025

KMM: ఆర్థిక సమస్యలు.. యువకుల సూసైడ్ అటెంప్ట్

image

ఎర్రుపాలెం మండలం ములుగుమాడుకి చెందిన స్నేహితులు ఆముదాల రాము, షేక్ జానీ ఆర్థిక సమస్యల కారణంగా బుధవారం రాత్రి పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు. వీరిలో రాము పరిస్థితి విషమించడంతో ఖమ్మంకు తరలించారు. జానీకి మధిరలో చికిత్స కొనసాగుతోంది. ఈ ఘటన గ్రామంలో కలకలం రేపింది.

News October 16, 2025

NGKL: మంత్రాల మాటున మాయ.. భర్త హత్య

image

NGKL జిల్లా శ్రీపురానికి చెందిన రాములును తమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని OCT 12 భార్య మానస, ప్రియుడు సురేశ్‌ హత్య చేసిన విషయం తెలిసిందే. పోలీసుల వివరాలు.. రాములు ఇంట్లో 6 నెలల క్రితం <<18015644>>బంగారం<<>> చోరీ కావడంతో సురేశ్ మంత్రశక్తితో కనిపెడతానని ఫ్యామిలీకి దగ్గరయ్యాడు. ఈ క్రమంలో మానసతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఇంట్లో విషయం తెలియడంతో గొడవలు జరిగాయి. భర్త అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ చేసి హతమార్చారు.