News October 16, 2025

ASF: ఆర్థిక స్థోమత లేని ఖైదీలకు ఉచిత న్యాయ సేవలు

image

ఆర్థిక స్థోమత లేని ఖైదీలకు ఉచిత న్యాయ సేవలు అందిస్తామని ASF జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంవీ రమేష్ అన్నారు. బుధవారం జన్కాపూర్ సబ్ జైలు అధికారులతో సమావేశం నిర్వహించారు. జైలులో ఖైదీలకు కల్పిస్తున్న సౌకర్యాలు, వారి ఆరోగ్య వివరాలను స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఖైదీల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు.

Similar News

News October 16, 2025

కర్నూలుకు పీఎం.. కడపకు భారీ పెట్టుబడులు

image

ఇవాళ ఏపీకి వస్తున్న ప్రధాని మోదీ కడప జిల్లాలో భారీ పలు ప్రాజెక్టులకు శంకుస్థాన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. కొప్పర్తిలో రూ.2,136 కోట్లతో పారిశ్రామిక కేంద్రానికి శంకుస్థాపన చేయనున్నారు. అలాగే కడప, నెల్లూరు సరిహద్దు నుంచి CS పురం వరకు 41 KM మేర 2 వరుసల హైవే, కమలాపురం వద్ద పాపాఘ్ని నదిపై నిర్మించిన వంతెనను ప్రారంభించనున్నారు. మరోవైపు కడప ఉక్కుపై ప్రధాని స్పందించాలని పలువురు కోరుతున్నారు.

News October 16, 2025

పాలమూరు: నేడు PUలో 4వ స్నాతకోత్సవం

image

పాలమూరు వర్సిటీలోని గ్రంథాలయ ఆడిటోరియంలో ఇవాళ ఉదయం 10 గంటలకు 4వ స్నాతకోత్సవం నిర్వహిస్తున్నట్లు VC ప్రొ.డాక్టర్ జి.ఎన్.శ్రీనివాస్ Way2Newsతో ప్రత్యేకంగా తెలిపారు. ముఖ్య అతిథిగా యూనివర్సిటీ ఛాన్స్‌‌‌లర్ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హాజరుకానున్నారు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. మొట్టమొదటిసారిగా గౌరవ డాక్టరేట్‌ను Dr.మన్నే సత్యనారాయణ రెడ్డికు ఇవ్వాలని వర్సిటీ పాలకమండలి నిర్ణయించింది.

News October 16, 2025

జనగామ: యంగ్ ఇండియా బిల్లులు.. రూ.24 లక్షల పైనే..!

image

జిల్లాలోని 71 ఉన్నత, 9 ప్రాథమిక, ఒక ప్రాథమికోన్నత పాఠశాలల్లో 15 రోజుల పాటు ‘యంగ్ ఇండియా’ పేరిట నిర్వహించిన వేసవి శిక్షణ శిబిరాల బిల్లులు రూ.24 లక్షల పైనే రావాల్సి ఉంది. ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు తమ సొంతంగా ఖర్చు చేశారు. నాలుగు నెలలైనా బిల్లులు రాకపోవడంతో వారు బిల్లుల కోసం నిరీక్షిస్తున్నారు.