News October 16, 2025
KMR: వైన్ షాపులరకు పోటాపోటీ దరఖాస్తులు

కామారెడ్డి జిల్లాలో 49 మద్యం దుకాణాల లైసెన్సుల కోసం బుధవారం వరకు మొత్తం 267 దరఖాస్తులు వచ్చాయని జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ హనుమంత రావు బుధవారం తెలిపారు. దరఖాస్తుల వివరాలు..
కామారెడ్డి: 15 షాపులకు 63 దరఖాస్తులు
బాన్సువాడ: 9 షాపులకు 59 దరఖాస్తులు
బిచ్కుంద: 10 షాపులకు 60 దరఖాస్తులు
దోమకొండ: 8 షాపులకు 44 దరఖాస్తులు
ఎల్లారెడ్డి: 7 షాపులకు 41 దరఖాస్తులు వచ్చాయని ఆయన చెప్పారు.
Similar News
News October 16, 2025
కేటిదొడ్డి: గుప్తనిధుల కోసం తవ్వకాలు

కేటిదొడ్డి మండలం గువ్వలదిన్నె సమీపంలో గుప్త నిధుల కోసం గుర్తుతెలియని వ్యక్తులు రోడ్డుపక్కకు ఉన్న ఆంజనేయస్వామి విగ్రహం దగ్గర తవ్వకాలు చేపట్టారు. నిధుల కోసం పెద్ద గుంతను తవ్వారు. దుండగులు తవ్వడం చేతకాక మధ్యలో వదిలేసి వెళ్లిపోయారు. ఆలయంలో ఎలాంటి వస్తువులు విగ్రహాలు ధ్వంసం కాలేదని గ్రామస్థులు తెలిపారు.
News October 16, 2025
అప్పుడు సమంత.. ఇప్పుడు సుమంత్..!

మంత్రి సురేఖ ఎప్పుడు ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటున్నారు. గతంలో నటి సమంత పైన చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే లేపాయి. చివరకు పరువు నష్టం కేసు పెట్టే వరకు వెళ్లింది. తాజాగా ఓఎస్డీ సుమంత్ వ్యవహారం ఆమె మంత్రి పదవి, ఎమ్మెల్యే పదవికి సైతం ఎసరు పెట్టేలా మారింది. ‘స’ అనే అక్షరం కలిసి రావడం లేదేమో? అని ప్రజలు చర్చించుకుంటున్నారు.
News October 16, 2025
MDK: ఎన్నికల అధికారులమంటూ చోరీ.. జాగ్రత్త

మెదక్ జిల్లాలో ఎన్నికల అధికారులమంటూ కేటుగాళ్లు చోరీకి పాల్పడ్డారు. పాపన్నపేట మం. నాగ్సాన్‌పల్లికి చెందిన దంపతులు కిషన్- మణెమ్మ ఎల్లుపేటలో ఫంక్షన్‌కు స్కూటీపై వెళ్తుండగా కొత్తపల్లి వంతెన వద్ద ఎన్నికల అధికారులమంటూ ఆగంతకులు ఆపారు. మీ ఆభరణాలు జాగ్రత్త, డిక్కీలో వేసుకోవాలన్నారు. ఆమె పుస్తెల తాడు, గుండ్లు తీసి దస్తీలో కట్టి డిక్కీలో వేయగా మరోసారి చెక్ చేద్దామని చెప్పి చాకచక్యంగా ఆభరణాలను తస్కరించారు.