News October 16, 2025

WGL: హెల్మెట్ ధరించడం నియమం కాదు.. జీవన రక్షణ!

image

హెల్మెట్ ధరించడం కేవలం రూల్స్ పాటించడం కాదు, జీవాన్ని విలువైనదిగా భావించే బాధ్యతగా చూడాలని వరంగల్ పోలీసులు సూచిస్తున్నారు. ప్రతి రైడ్‌లో జాగ్రత్తగా, సమర్థంగా వ్యవహరించడం ద్వారా మనతో పాటు మన కుటుంబ సభ్యుల భద్రతను కాపాడుకోవచ్చన్నారు. ప్రతి బైక్ రైడ్‌కు ముందు హెల్మెట్ ధరించడం మన జీవితాన్ని సురక్షితంగా ఉంచే మొదటి అడుగని వారు సూచించారు.

Similar News

News October 16, 2025

జనగామ: 18న విద్యాసంస్థల బంద్: జేఏసీ

image

బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్త కార్యాచరణలో భాగంగా ఈనెల 18న జనగామ జిల్లాలోని విద్యాసంస్థలను బంద్ చేయనున్నట్లు బీసీ జేఏసీ ప్రతినిధులు తీర్మానించారు. కావున ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్, ప్రభుత్వరంగ పరిధిలోని విద్యాసంస్థలు స్వచ్ఛందంగా బంద్‌కు సహకరించాలని కోరారు.

News October 16, 2025

మంగళగిరి: ‘పవన్‌ కళ్యాణ్‌ను కలిసేదాకా ఊరెళ్లను’

image

బెట్టింగ్‌ యాప్‌ల వల్ల తనలా ఎవరూ నష్టపోకూడదని సాయి కుమార్ అనే యువకుడు పాదయాత్ర చేస్తూ వైజాగ్ నుంచి మంగళగిరి జనసేన ఆఫీసుకు వచ్చాడు. బెట్టింగ్ యాప్‌ల వలలో పడి రూ.20 లక్షలు నష్టపోయానని తెలిపాడు. మరొకరు ఇలా నష్టపోకూడదని అవగాహన కల్పిస్తున్నట్లు పేర్కొన్నాడు. ఈ యాప్‌లపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కఠిన చర్యలు తీసుకోవాలని ఆఫీసు ముందు నిరసనకు దిగారు. పవన్‌ను నేరుగా కలిసి విన్నవించాకనే వెళ్తానంటున్నాడు.

News October 16, 2025

సిరిసిల్ల: 5 లక్షల క్వింటాళ్ల పత్తి దిగుబడి వచ్చే ఛాన్స్

image

సీసీఐ కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు పత్తిని విక్రయించి మద్దతు ధర పొందాలని సిరిసిల్ల కలెక్టర్ ఎం.హరిత అన్నారు. సిరిసిల్లలోని కలెక్టరేట్లో పత్తి మొబైల్ యాప్‌ను ఆమె బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ సంవత్సరం జిల్లాలో సుమారు 5 లక్షల క్వింటాళ్ల పత్తి దిగుబడి అయ్యే అవకాశం ఉందన్నారు. గతేడాది జిల్లాలో ప్రభుత్వం 2,46,000 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేసిందన్నారు.