News October 16, 2025

SRD: NMMSకు దరఖాస్తు గడువు పొడిగింపు

image

నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ ఉపకార వేతనాలకు దరఖాస్తు గడువును ఈనెల 18 వరకు పొడిగించినట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదివే విద్యార్థులు https://bse.telangana.gov.inలో దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. ఎంపికైన వారికి నెలకు రూ.1000 చొప్పున నాలుగేళ్లు ఉపకార వేతనం అందిస్తారని పేర్కొన్నారు.

Similar News

News October 16, 2025

దారులన్నీ కర్నూలుకు..

image

కర్నూలు, నంద్యాల జిల్లాలతో పాటు పొరుగు జిల్లాల ప్రజలు కర్నూలు ‘జీఎస్టీ 2.0’ సభకు తరలివెళ్తున్నారు. జిల్లాల్లోని అన్ని మండలాలకు 4,227 బస్సులు కేటాయించడంతో కూటమి నాయకులు, కార్యకర్తలు బస్సుల్లో పెద్ద ఎత్తున పయనమయ్యారు. హైవేలపై ఈ బస్సులే కనిపిస్తున్నాయి. రాగమయూరి గ్రీన్ హిల్స్ ప్రాంగణం ఇప్పటికే జనంతో నిండిపోయింది. ప్రజలకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా మధ్యాహ్న భోజనం, సాయంత్రానికి స్నాక్స్ అందుబాటులో ఉంచారు.

News October 16, 2025

NLG: వేరుశనగ.. సాగు పెంపే లక్ష్యం..!

image

జిల్లాలో ఏటేటా తగ్గిపోతున్న వేరుశనగ పంటల సాగును పెంచేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. జిల్లాలో రెండు 2,22,444 హెక్టార్లలో పంట సాగు చేయించాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు నిర్ణయించారు. రైతులకు ఉచితంగా విత్తనాలు అందించనున్నారు. పంట నూనెల ఉత్పత్తులను పెంచడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేసేందుకు సన్నద్ధమైనట్లు జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్ కుమార్ తెలిపారు.

News October 16, 2025

NLG: మాధవరెడ్డి హత్య.. జనస్రవంతిలోకి ఆశన్న

image

మావోయిస్టు పార్టీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. నిన్న ఆ పార్టీ కీలక నాయకుడు మల్లోజుల మహారాష్ట్ర CM ఎదుట 60 మందితో లొంగిపోయిన సంగతి తెలిసిందే. నేడు మరో కీలక నేత తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న అజ్ఞాతం వీడనున్నట్లు సమాచారం. ములుగు (D) చెందిన ఆశన్న IPS ఉమేష్ చంద్ర, ఎలిమినేటి మాధవరెడ్డిని హత్య చేసిన ఆపరేషన్‌కు నేతృత్వం వహించినట్లు చెబుతారు. అలిపిరి బ్లాస్ట్‌తో ఆశన్న పేరు విస్తృతమైంది.