News October 16, 2025
SECLలో 1,138 పోస్టులు

సౌత్ ఈస్ట్రర్న్ కోల్‌ఫీల్డ్స్ (SECL) 1138 పోస్టులకు వేర్వేరుగా నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో అసిస్టెంట్ ఫోర్‌మెన్(543 ), మైనింగ్ సిర్దార్, Jr ఓవర్‌మెన్(595 ) పోస్టులు ఉన్నాయి. మైనింగ్ సిర్దార్, Jr ఓవర్‌మెన్ పోస్టులకు OCT 30 అప్లైకి ఆఖరు తేదీ కాగా.. అసిస్టెంట్ ఫోర్‌మెన్ పోస్టులకు నేటి నుంచి NOV 9 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిప్లొమా, BE, బీటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
Similar News
News October 16, 2025
పాత రిజర్వేషన్లతో ‘స్థానిక’ ఎన్నికలు!

తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అంశం మళ్లీ మొదటికొచ్చింది. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో-9ను అత్యున్నత ధర్మాసనం సుప్రీంకోర్టు కూడా తిరస్కరించింది. దీంతో స్థానిక ఎన్నికలు పాత రిజర్వేషన్ల ఆధారంగానే జరిగే అవకాశం కనిపిస్తోంది. అయితే కాంగ్రెస్ గతంలో ఇచ్చిన హామీ ప్రకారం పార్టీ పరంగా బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్లే ఛాన్స్ ఉంది. త్వరలో దీనిపై క్లారిటీ రానుంది.
News October 16, 2025
మొబైల్‌తో వెళ్తే అలాగే కూర్చుండిపోతారు!

మెరుగైన పేగు ఆరోగ్యం కోసం బాత్రూమ్‌లో ఫోన్ వాడటం ఆపేయాలని గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌లు హెచ్చరిస్తున్నారు. ఫోన్ చూస్తూ ఎక్కువసేపు కూర్చుంటే మలసిరలపై ఒత్తిడి పెరిగి పైల్స్ వచ్చే ప్రమాదం 46% వరకు పెరుగుతుందని చెబుతున్నారు. ‘ముఖ్యంగా బాత్రూమ్‌లో ఫోన్ వాడకండి. ఫైబర్ ఎక్కువగా తీసుకోండి. హైడ్రేటెడ్‌గా ఉండండి. వెస్ట్రన్ కమోడ్ ఉపయోగిస్తే చిన్న స్టూల్‌పై కాళ్లు ఉంచండి. హ్యాండ్ వాష్ చేసుకోండి ’ అని తెలిపారు.
News October 16, 2025
‘డెక్కన్ సిమెంట్’ అటవీ భూ ఆక్రమణలపై దర్యాప్తు

TG: మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత ఆరోపణలతో తెరపైకి వచ్చిన ‘డెక్కన్ సిమెంటు’పై చర్చ జరుగుతోంది. సూర్యాపేట(D)లో ఈ కంపెనీ 73 Acr అటవీ భూమిని ఆక్రమించిందని ఫిర్యాదులు రాగా గ్రీన్‌ట్రిబ్యునల్ విచారించింది. అటు కేంద్ర అటవీశాఖ కూడా ఆక్రమణలపై దర్యాప్తు చేయాలని 10 రోజుల క్రితం రాష్ట్రాన్ని ఆదేశించింది. దీనిపై రాష్ట్ర అటవీశాఖ విచారిస్తోంది. ఆక్రమణ ఏమేరకు ఉందో త్వరలో తేలుతుందని అధికారులు పేర్కొన్నారు.