News October 16, 2025

ఇతిహాసాలు క్విజ్ – 37

image

1. నీళ్లు తాగుతున్న శబ్దం విని, జింక అనుకొని దశరథుడు ఎవర్ని సంహరించాడు?
2. అభిమన్యుడు, ఉత్తరల పుత్రుడు ఎవరు?
3. వాయుదేవుడి వాహనం ఏది?
4. విష్ణువు ఏ అవతారంలో జలరాక్షసుడైన శంఖాసురుడిని సంహరించాడు?
5. నవతి అంటే ఎంత?
* సరైన సమాధానాలను సాయంత్రం 6 గంటలకు పబ్లిష్ చేస్తాం. <<-se>>#Ithihasaluquiz<<>>

Similar News

News October 16, 2025

మేం కులసర్వేలో పాల్గొనం: నారాయణమూర్తి దంపతులు

image

కర్ణాటక ప్రభుత్వ కుల, విద్య, ఆర్థిక సర్వేలో పాల్గొనేందుకు ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణ మూర్తి, అతని భార్య సుధా మూర్తి నిరాకరించారు. ‘మేం వెనుకబడిన తరగతికి చెందినవాళ్లం కాదు. ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా ముందున్నాం. మా సమాచారాన్ని పొందడం వల్ల ప్రభుత్వానికి లేదా OBCలకు ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఈ సర్వే ప్రాథమిక ఉద్దేశం BCలను గుర్తించి, వారికి సౌకర్యాలు కల్పించడం’ అని డిక్లరేషన్ ఫాం ఇచ్చారని సమాచారం.

News October 16, 2025

సినీ ముచ్చట్లు!

image

*మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాలోని ‘మీసాల పిల్ల’ సాంగ్ యూట్యూబ్ మ్యూజిక్ ఛార్ట్స్‌లో ఇండియాలో నంబర్ 1గా ట్రెండ్ అవుతోంది.
*డెక్కన్ కిచెన్ హోటల్ కూలగొట్టిన వ్యవహారంలో వెంకటేశ్, రానా తప్పనిసరిగా విచారణకు హాజరు కావాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది.
*‘బాహుబలి ది ఎపిక్’ రిలీజ్‌కు ముందే రికార్డులు సృష్టిస్తోంది. అడ్వాన్స్ బుకింగ్స్‌లో USలో లక్ష డాలర్లకు చేరువలో ఉంది.

News October 16, 2025

క్రాస్ కంట్రీ స్కీయింగ్‌లో చరిత్ర సృష్టించిన భవానీ

image

క్రాస్ కంట్రీ స్కీయింగ్‌లో దేశం తరఫున మొదటి పతకాన్ని గెలుచుకొని TN భవాని రికార్డు సృష్టించారు. కర్ణాటకలోని కొడగుకు చెందిన భవానీ చిలీలో జరిగిన 5 కి.మీ ఇంటర్వెల్ స్టార్ట్ ఫ్రీ రేసులో 21:04.9 సెకన్లలో గమ్యాన్ని చేరుకుని కాంస్యం సాధించారు. ట్రెక్కింగ్‌తో మొదలైన భవానీ ప్రయాణం ప్రస్తుతం స్కీయింగ్‌‌లో రికార్డులు సృష్టించేవరకు వచ్చింది. 2026 వింటర్ ఒలింపిక్సే లక్ష్యమని ఆమె చెబుతున్నారు. <<-se>>#InspiringWomen<<>>