News October 16, 2025
కొయ్యలగూడెం: ఆవుకి కవల దూడలు జననం

కొయ్యలగూడెంలోని పరింపూడి పశువైద్యశాల వద్ద ఆవు అరుదైన కవలలకు (ఒక పెయ్య, ఒక గిత్త దూడ) జన్మనిచ్చింది. ప్రసవ సమయంలో ఆవు ఇబ్బంది పడగా, వైద్యాధికారి బి.ఆర్. శ్రీనివాస్ ట్రాక్టర్ హైడ్రాలిక్ సహాయంతో ఆవును పైకి ఎత్తి ప్రసవం అయ్యేలా కృషి చేశారు. ఈ ప్రత్యేక ప్రయత్నానికి రైతులు వైద్యాధికారి, సిబ్బందిని అభినందించారు.
Similar News
News October 16, 2025
గాంధారి శివారులో వ్యక్తి హత్య?

కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలో దారుణం జరిగింది. గాంధారి నుంచి చద్మల్ దారిలో ఒక గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కలకలం రేపింది. గుర్తుతెలియని వ్యక్తులు అతన్ని హత్య చేసి పెట్రోల్ పోసి దహనం చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. శవం పాక్షికంగా కాలిపోయింది. మృతుడి వయస్సు సుమారు 30 ఏళ్లు ఉంటుందని పేర్కొన్నారు. ఎవరైనా వ్యక్తిని గుర్తిస్తే గాంధారి ఎస్ఐకి తెలపాలన్నారు.
News October 16, 2025
మేం కులసర్వేలో పాల్గొనం: నారాయణమూర్తి దంపతులు

కర్ణాటక ప్రభుత్వ కుల, విద్య, ఆర్థిక సర్వేలో పాల్గొనేందుకు ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణ మూర్తి, అతని భార్య సుధా మూర్తి నిరాకరించారు. ‘మేం వెనుకబడిన తరగతికి చెందినవాళ్లం కాదు. ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా ముందున్నాం. మా సమాచారాన్ని పొందడం వల్ల ప్రభుత్వానికి లేదా OBCలకు ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఈ సర్వే ప్రాథమిక ఉద్దేశం BCలను గుర్తించి, వారికి సౌకర్యాలు కల్పించడం’ అని డిక్లరేషన్ ఫాం ఇచ్చారని సమాచారం.
News October 16, 2025
గుంటూరు మిర్చి యార్డులో ధరలు..

గుంటూరు మిర్చి యార్డుకు గురువారం లక్ష క్వింటాళ్ల AC సరుకు అమ్మకానికి వచ్చింది. రకం, నాణ్యతను బట్టి క్వింటాలుకు ధరలు ఇలా ఉన్నాయి. తేజా, 355, 2043 రకాలు: కేజీ ₹100 నుంచి ₹160 వరకు పలికాయి. యల్లో రకం: అత్యధికంగా కేజీ ₹200 నుంచి ₹230 వరకు పలికింది. నెంబర్ 5, DD రకాలు: కేజీ ₹110 – ₹155 మధ్య ఉన్నాయి. మీడియం సీడ్ రకాలు ₹80 – ₹100, బుల్లెట్ రకాలు ₹90 – ₹145 మధ్య ట్రేడ్ అయ్యాయి.