News October 16, 2025

ఏసీబీకి చిక్కిన అవినీతి అధికారులు

image

ఏసీబీ ముమ్మర దాడులు నిర్వహిస్తున్నా కొందరు అధికారుల్లో మార్పు రావడం లేదు. బుధవారం అనంతపురంలోని జెడ్పీ పరిషత్ క్యాంపస్‌లో సీనియర్ ఆడిటర్ లక్ష్మీనారాయణ, అటెండర్ నూర్ అక్రమ సంపాదన బాగోతం బట్టబయలైంది. లక్ష్మీనారాయణ రూ.10 వేలు, నూర్ రూ.8 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

Similar News

News October 16, 2025

మంచిర్యాల: గురుకులాల సీట్ల భర్తీకి దరఖాస్తులు

image

మంచిర్యాల జిల్లాలోని అన్ని సాంఘిక సంక్షేమ గురుకుల హాస్టల్స్‌లో 2025-26 విద్యా సంవత్సరానికి 5 నుంచి 9వ తరగతులలో మిగిలిన సీట్లను భర్తీ చేయనున్నట్లు కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. ఈ విద్యా సంవత్సరంలో గురుకుల పరీక్షలు రాసిన విద్యార్థులు అర్హులు అన్నారు. ఈ నెల 17 వరకు లక్షెట్టిపేట గురుకుల పాఠశాలలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

News October 16, 2025

రేపు గుంతకల్లుకు సినీ తారలు

image

గుంతకల్లు పట్టణానికి రేపు సినీ తారలు రానున్నారు. పట్టణంలోని రైల్వే స్టేషన్ రోడ్డులో ఓ నూతన షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం చేయడానికి సినీ హీరోయిన్స్ ఐశ్వర్య రాజేశ్, రితిక నాయక్ వస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ మేరకు ఏర్పాట్లు చేశామని చెప్పారు. రితిక నాయక్ ఇటీవల విడుదలైన మిరాయ్ చిత్రంతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు.

News October 16, 2025

బోగస్ ఓట్లపై ఈసీకి ఆదేశాలు ఇవ్వలేం: HC

image

TG: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బోగస్ ఓట్లపై కేటీఆర్, మాగంటి సునీత దాఖలు చేసిన పిటిషన్లపై విచారణలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ సమయంలో ఈసీకి ప్రత్యేక ఆదేశాలు ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఇప్పటికే ఎన్నికల సంఘం ఎలక్టోరల్స్‌ను రివిజన్ చేస్తోందని, ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని చెబుతూ విచారణను ముగించింది.