News October 16, 2025

పవన్ కళ్యాణ్ రాజోలు పర్యటన వాయిదా.!

image

పవన్ కళ్యాణ్ రాజోలు పర్యటన వాయిదా పడింది. ఈ నెల 16న మోదీ కర్నూలు పర్యటన, దాంతో పాటు వాడపల్లి బ్రహ్మోత్సవాలు జరుగుతుండడంతో పోలీసు బలగాలు ఆ కార్యక్రమాలకు వెళ్లనున్నాయి. ఈ మేరకు దీపావళి అనంతరం రాజోలుకు పవన్ రానున్నట్లు MLA దేవ వరప్రసాద్ ప్రకటన విడుదల చేశారు. పర్యటనలో భాగంగా కేశనపల్లి తీరంలో తోటల పరిశీలన, పల్లెపండుగలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు.

Similar News

News October 16, 2025

కరీంనగర్ గిన్నప్ప రుచి వేరు..!

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎన్నో వంటకాలు ఉన్నప్పటికీ సర్వపిండి(గిన్నప్ప) చాలా స్పెషల్. గ్రామీణ ప్రాంతాల్లో కట్టెల పొయ్యిపై చేసిన సర్వపిండి తింటే ఆ రుచి ఎప్పటికీ మరువరు. ఇది ప్రస్తుతం నగరాల్లోకి వ్యాపించింది. కర్రీ పాయింట్లలో రూ.10-20 చొప్పున ఒక సర్వపిండి విక్రయిస్తున్నారు. ఈ జనరేషన్‌తో పోలిస్తే 90’sలో స్కూల్‌కు వెళ్లొచ్చేలోపు ఇంటి వద్ద అమ్మ చేసిన సర్వపిండి రెడీగా ఉండేది. నేడు ప్రపంచ భోజన దినోత్సవం.

News October 16, 2025

ముగ్గుర్నీ చూస్తుంటే కనులపండువే: పయ్యావుల

image

AP: కూటమికి వేసిన ఒక్క ఓటు వంద లాభాలను తెచ్చిందని కర్నూలు GST సభలో మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. ‘నరేంద్రుడు, ఇంద్రుడు, తుఫాన్ లాంటి పవన్ కళ్యాణ్‌ను చూస్తుంటే రాష్ట్ర ప్రజలకు ఇవాళ కనులపండువగా ఉంది. టారిఫ్‌ల పేరుతో మెడలు వంచుతామంటే స్వదేశీ నినాదంతో ప్రపంచ దేశాలను మనవైపు తిప్పేలా చేసిన నాయకత్వం మోదీది. భవిష్యత్తు తరాల తలరాతలు మార్చే నాయకత్వంపై రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉన్నారు’ అని వ్యాఖ్యానించారు.

News October 16, 2025

HYD: నామినేషన్ ఇప్పుడు పార్ట్ టైమ్ బిజినెస్

image

ఎన్నికలంటే ఎంతోమంది నామినేషన్లు వేయడం చూస్తుంటాం. వీరిలో కొందరు పేరు కోసం వేస్తే.. మరికొందరు స్వలాభం కోసం వేస్తారు. పేరుకోసం వేసేవారు తాను ఇన్నిసార్లు నామినేషన్ ఫైల్ చేశా అని చెప్పకోవడానికి, ఇంకొందరు ఓట్లు చీల్చడానికి స్వలాభంతో పోటీలో దిగుతారు. దీంతో గెలుపు అవకాశాలు కొందరికి తగ్గిపోతాయి. అందుకే గెలిచే అభ్యర్థి ఇచ్చే డబ్బుతో విత్ డ్రా చేసుకుంటారన్నమాట. ఇప్పుడుదే ట్రెండ్ర్ జూబ్లీలో కొనసాగుతోందా?