News October 16, 2025
జనగామ: యంగ్ ఇండియా బిల్లులు.. రూ.24 లక్షల పైనే..!

జిల్లాలోని 71 ఉన్నత, 9 ప్రాథమిక, ఒక ప్రాథమికోన్నత పాఠశాలల్లో 15 రోజుల పాటు ‘యంగ్ ఇండియా’ పేరిట నిర్వహించిన వేసవి శిక్షణ శిబిరాల బిల్లులు రూ.24 లక్షల పైనే రావాల్సి ఉంది. ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు తమ సొంతంగా ఖర్చు చేశారు. నాలుగు నెలలైనా బిల్లులు రాకపోవడంతో వారు బిల్లుల కోసం నిరీక్షిస్తున్నారు.
Similar News
News October 16, 2025
కరీంనగర్ గిన్నప్ప రుచి వేరు..!

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎన్నో వంటకాలు ఉన్నప్పటికీ సర్వపిండి(గిన్నప్ప) చాలా స్పెషల్. గ్రామీణ ప్రాంతాల్లో కట్టెల పొయ్యిపై చేసిన సర్వపిండి తింటే ఆ రుచి ఎప్పటికీ మరువరు. ఇది ప్రస్తుతం నగరాల్లోకి వ్యాపించింది. కర్రీ పాయింట్లలో రూ.10-20 చొప్పున ఒక సర్వపిండి విక్రయిస్తున్నారు. ఈ జనరేషన్‌తో పోలిస్తే 90’sలో స్కూల్‌కు వెళ్లొచ్చేలోపు ఇంటి వద్ద అమ్మ చేసిన సర్వపిండి రెడీగా ఉండేది. నేడు ప్రపంచ భోజన దినోత్సవం.
News October 16, 2025
ముగ్గుర్నీ చూస్తుంటే కనులపండువే: పయ్యావుల

AP: కూటమికి వేసిన ఒక్క ఓటు వంద లాభాలను తెచ్చిందని కర్నూలు GST సభలో మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. ‘నరేంద్రుడు, ఇంద్రుడు, తుఫాన్ లాంటి పవన్ కళ్యాణ్‌ను చూస్తుంటే రాష్ట్ర ప్రజలకు ఇవాళ కనులపండువగా ఉంది. టారిఫ్‌ల పేరుతో మెడలు వంచుతామంటే స్వదేశీ నినాదంతో ప్రపంచ దేశాలను మనవైపు తిప్పేలా చేసిన నాయకత్వం మోదీది. భవిష్యత్తు తరాల తలరాతలు మార్చే నాయకత్వంపై రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉన్నారు’ అని వ్యాఖ్యానించారు.
News October 16, 2025
HYD: నామినేషన్ ఇప్పుడు పార్ట్ టైమ్ బిజినెస్

ఎన్నికలంటే ఎంతోమంది నామినేషన్లు వేయడం చూస్తుంటాం. వీరిలో కొందరు పేరు కోసం వేస్తే.. మరికొందరు స్వలాభం కోసం వేస్తారు. పేరుకోసం వేసేవారు తాను ఇన్నిసార్లు నామినేషన్ ఫైల్ చేశా అని చెప్పకోవడానికి, ఇంకొందరు ఓట్లు చీల్చడానికి స్వలాభంతో పోటీలో దిగుతారు. దీంతో గెలుపు అవకాశాలు కొందరికి తగ్గిపోతాయి. అందుకే గెలిచే అభ్యర్థి ఇచ్చే డబ్బుతో విత్ డ్రా చేసుకుంటారన్నమాట. ఇప్పుడుదే ట్రెండ్ర్ జూబ్లీలో కొనసాగుతోందా?