News October 16, 2025
వనపర్తి: తప్పనిసరిగా పాఠశాలలను సందర్శించాలి- కలెక్టర్

ఎంఈఓలు, క్లస్టర్ హెడ్మాస్టర్లు తప్పనిసరిగా రోజుకు 2 లేదా 3 పాఠశాలలను విధిగా సందర్శించి, పర్యవేక్షణ చేయాలని అధికారులను కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. సందర్శించిన పాఠశాలల్లో FLN అటెండెన్స్, అపార్ ఐడి జనరేషన్ పై దృష్టి సారించి, మెరుగుపరిచే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. సమాజంలో విద్యార్థులను ఉన్నత శిఖరాలకు చేర్చి మంచి సమాజాన్ని నిర్మించడంలో ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారుల పాత్ర కీలకం అన్నారు.
Similar News
News October 16, 2025
నిర్మల్: వైద్య కళాశాలలో ప్రొఫెసర్ల భర్తీకి దరఖాస్తులు

జిల్లా వైద్య కళాశాలలో కాంట్రాక్టు పద్ధతిలో ప్రొఫెసర్ల పోస్టుల భర్తీకి దరఖాస్తులకు ఆహ్వానిస్తున్నారు. కాలేజీలో ఒబెస్ట్రిక్ గైనకాలజీ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్ 1, అసిస్టెంట్ ప్రొఫెసర్ 4, సీనియర్ రెసిడెంట్ 2, రేడియో డయగ్నోసిస్‌లో అసోసియేట్ ప్రొఫెసర్ 1, అసిస్టెంట్ ప్రొఫెసర్ 1, సీనియర్ రెసిడెంట్ 1 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల భర్తీకి కాలేజీలోనే ఈ నెల 22న ఇంటర్వ్యూలు ఉండనున్నాయి.
News October 16, 2025
మంత్రి పొన్నం ప్రభాకర్‌పై దుష్ప్రచారం.. పోలీసులకు ఫిర్యాదు

మంత్రి పొన్నం ప్రభాకర్‌పై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కరీంనగర్ వన్ టౌన్ పోలీసులకు యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు అబ్దుల్ రహమాన్ కాంగ్రెస్ నాయకులతో కలిసి ఫిర్యాదు చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ చనిపోయారని సోషల్ మీడియాలో పెట్టి దుష్ప్రచారం చేస్తున్న బీఆర్ఎస్‌కు చెందిన గీతారెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.
News October 16, 2025
RNSBలో ఉద్యోగాలు

రాజ్‌కోట్ నాగరిక్ సహకారి బ్యాంక్ లిమిటెడ్(RNSB) జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. డిగ్రీ, పీజీ అర్హతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు ఈ నెల 23 వరకు అప్లై చేసుకోవచ్చు. గరిష్ఠ వయసు 30ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి సడలింపు ఉంది. కాంట్రాక్ట్ పద్ధతిలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. వెబ్‌సైట్: https://rnsbindia.com/