News October 16, 2025

HYD: అయ్యో.. ఆమె బయటపడుతుందా?

image

HYD మహిళకు 25ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ దుబాయ్‌ కోర్టు తీర్పునిచ్చింది. బహదూర్‌పురకు చెందిన మహిళ బ్యూటీషన్ పనికోసం దుబాయ్‌ వెళ్లడానికి ఓ ఏజెంట్ ద్వారా వీసా ప్రాసెసింగ్ చేసుకుంది. అతడు ఆమెకు ఓ పార్సిల్ ఇచ్చాడని, ఎయిర్‌పోర్ట్‌లో దిగాక అందులో గంజాయి ఉందని కుటుంబీకులు ఆరోపించారు. ఆమెకు 5ఏళ్ల కొడుకు ఉన్నాడు. కుటుంబపోషణకు వెళ్తే.. జైలుశిక్ష పడిందని ఆమెను కాపాడాలని కేంద్రాన్ని కోరగా ప్రభుత్వం స్పందించింది.

Similar News

News October 16, 2025

నిర్మల్: వైద్య కళాశాలలో ప్రొఫెసర్ల భర్తీకి దరఖాస్తులు

image

జిల్లా వైద్య కళాశాలలో కాంట్రాక్టు పద్ధతిలో ప్రొఫెసర్ల పోస్టుల భర్తీకి దరఖాస్తులకు ఆహ్వానిస్తున్నారు. కాలేజీలో ఒబెస్ట్రిక్ గైనకాలజీ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్ 1, అసిస్టెంట్ ప్రొఫెసర్ 4, సీనియర్ రెసిడెంట్ 2, రేడియో డయగ్నోసిస్‌లో అసోసియేట్ ప్రొఫెసర్ 1, అసిస్టెంట్ ప్రొఫెసర్ 1, సీనియర్ రెసిడెంట్ 1 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల భర్తీకి కాలేజీలోనే ఈ నెల 22న ఇంటర్వ్యూలు ఉండనున్నాయి.

News October 16, 2025

మంత్రి పొన్నం ప్రభాకర్‌పై దుష్ప్రచారం.. పోలీసులకు ఫిర్యాదు

image

మంత్రి పొన్నం ప్రభాకర్‌పై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కరీంనగర్ వన్ టౌన్ పోలీసులకు యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు అబ్దుల్ రహమాన్ కాంగ్రెస్ నాయకులతో కలిసి ఫిర్యాదు చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ చనిపోయారని సోషల్ మీడియాలో పెట్టి దుష్ప్రచారం చేస్తున్న బీఆర్ఎస్‌కు చెందిన గీతారెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.

News October 16, 2025

RNSBలో ఉద్యోగాలు

image

రాజ్‌కోట్ నాగరిక్ సహకారి బ్యాంక్ లిమిటెడ్(RNSB) జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. డిగ్రీ, పీజీ అర్హతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు ఈ నెల 23 వరకు అప్లై చేసుకోవచ్చు. గరిష్ఠ వయసు 30ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి సడలింపు ఉంది. కాంట్రాక్ట్ పద్ధతిలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. వెబ్‌సైట్: https://rnsbindia.com/