News October 16, 2025
గద్వాల: మద్యం దుకాణాలకు 127 దరఖాస్తులు

గద్వాల జిల్లాలోని ప్రభుత్వం నియమించిన 34 మద్యం దుకాణాలకు బుధవారం వరకు వచ్చిన దరఖాస్తులు గద్వాల్ 71, అలంపూర్ 56 జిల్లా వ్యాప్తంగా మొత్తం 127 దరఖాస్తులు వచ్చినట్లు ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు. ఇంకా మూడు రోజుల సమయం ఉన్నందున దరఖాస్తులు ఎక్కువ వచ్చే అవకాశం ఉందని ఎక్సైజ్ శాఖ అధికారులు అన్నారు.
Similar News
News October 16, 2025
క్యాబినెట్ సమావేశానికి కొండా సురేఖ గైర్హాజరు

TG: రాష్ట్ర మంత్రివర్గ సమావేశానికి మంత్రి కొండా సురేఖ గైర్హాజరయ్యారు. కొద్దిసేపటి క్రితం డిప్యూటీ సీఎం భట్టితో భేటీ అయిన సురేఖ.. సచివాలయానికి రాకుండా బయటకు వెళ్లిపోయారు. మిగతా మంత్రులందరూ హాజరయ్యారు. ఇటీవల నెలకొన్న <<18020734>>వివాదాలతో<<>> ఆమె మంత్రివర్గ సమావేశానికి దూరంగా ఉన్నట్లు సమాచారం.
News October 16, 2025
గుజరాత్ మంత్రులంతా రాజీనామా

గుజరాత్‌లో కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. స్థానిక ఎన్నికల దృష్ట్యా క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ కోసం ముఖ్యమంత్రి తప్ప మిగతా 16 మంది మంత్రులు తమ పదవులకు రాజీనామా చేశారు. కాసేపట్లో సీఎం భూపేంద్ర పటేల్ గవర్నర్‌ను కలవనున్నారు. రేపు ఉదయం 11.30 గంటలకు కొత్త క్యాబినెట్ కొలువుదీరనుంది. నూతన మంత్రివర్గంలో 10 మంది కొత్తవారికి అవకాశం దక్కనున్నట్లు సమాచారం.
News October 16, 2025
23 నుంచి అన్ని పాఠశాలల్లో ఆధార్ నవీకరణ: కలెక్టర్

విద్యార్థుల ఆధార్ నవీకరణకు ఈనెల 23 నుంచి అన్ని పాఠశాలల్లో ఆధార్ నవీకరణ ప్రారంభిస్తామని కలెక్టర్ వినోద్ కుమార్ గురువారం తెలిపారు. విద్యార్థులకు ఎలాంటి సమస్యలు రాకుండా అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో 110 ఆధార్ నమోదు కేంద్రాలు ఉండగా, ప్రస్తుతం 80 కేంద్రాలు పని చేయడంతో వాటి వివరాలు అడిగి తెలుసుకున్నారు.