News October 16, 2025

సిద్దిపేటలో హృదయ విదారక ఘటన

image

సిద్దిపేట జిల్లా పుల్లూరులో హృదయ విదారక ఘటన జరిగింది. ఆయనకు ముగ్గురు పిల్లలున్నా.. ఆయన మృతదేహాన్ని ఉంచేందుకు సొంతిళ్లు లేకపోయంది. పోచయ్యకు భార్య, ఇద్దరు కొడుకులు, కుమార్తె ఉన్నారు. అద్దె ఇంట్లో ఉంటున్న పోచయ్య ఆరోగ్య క్షీణించి చనిపోయారు. పొలం విషయంలో గొడవలు జరుగుతుండగా అంత్యక్రియలకు కొడుకులు ముందుకు రాలేదు. దీంతో మృతదేహాన్ని రైతు వేదికలో ఉంచి గ్రామస్థుల సహకారంతో భార్యే అంత్యక్రియలు నిర్వహించింది.

Similar News

News October 16, 2025

ములుగు: దామోదరన్న లొంగిపోతారా?

image

మావోయిస్టు పార్టీలో సుదీర్ఘంగా కీలక నేతలుగా ఉన్న ఒక్కొక్కరు లొంగిపోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాల్వపల్లికి చెందిన బడే చొక్కారావు@ దామోదర్ లొంగిపోతారా? పార్టీలో కొనసాగుతారా? అనే చర్చ జరుగుతోంది. 30 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉన్న దామోదర్.. సభ్యుడు, దళ కమాండర్, కేకేడబ్ల్యూగా ఎదిగి, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యత వహిస్తున్నారు.

News October 16, 2025

‘ఓటుకు నోటు’ కేసు విచారణ వాయిదా

image

‘ఓటుకు నోటు‘ కేసు నిందితులు రేవంత్, సండ్ర వెంకట వీరయ్య పిటిషన్లపై విచారణను సుప్రీంకోర్టు నవంబర్ 3కి వాయిదా వేసింది. రేవంత్‌పై ఏసీబీ నమోదు చేసిన కేసు చట్టవిరుద్ధమని నిన్న ఆయన తరపు న్యాయవాది ముకుల్ రోహత్గీ పేర్కొన్నారు. ఏసీబీ చట్టం ప్రకారం లంచం తీసుకోవడమే నేరమని వాదించారు. గురువారం కూడా వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణను వాయిదా వేసింది. న్యాయమూర్తులు మహేశ్వరి, విజయ్ బిష్ణోయ్ కేసు విచారించారు.

News October 16, 2025

విద్యార్థుల సమగ్రాభివృద్ధే లక్ష్యం: భద్రాద్రి కలెక్టర్

image

జిల్లాలో గిరిజన విద్యార్థుల సమగ్ర అభివృద్ధి, విద్యా ప్రమాణాల పెంపు, మౌలిక వసతుల అభివృద్ధి ప్రధాన లక్ష్యమని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. గురువారం పాల్వంచలోని కిన్నెరసాని గిరిజన గురుకుల పాఠశాల(బాలుర)ను సందర్శించిన ఆయన, పాఠశాల విద్యా కార్యక్రమాలు, వసతుల పరిస్థితి, విద్యార్థుల సౌకర్యాలను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఖాళీగా ఉన్న భూమిని కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేయాలని సూచించారు.