News October 16, 2025
కర్నూలులో అడుగుపెట్టిన మోదీ

ప్రధాని మోదీ కర్నూలుకు చేరుకున్నారు. ఓర్వకల్లు వినానాశ్రయంలో ఆయనకు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వాగతం పలికారు. అనంతరం ఎంఐ-17 హెలికాప్టర్‌లో సుండిపెంటకు బయలుదేరారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో శ్రీశైలం వెళ్లి భ్రమరాంబ అమ్మవారు, మల్లికార్జున స్వామిని దర్శించుకుంటారు. మ.2.20కి కర్నూలులో జరిగి ‘జీఎస్టీ 2.0’ సభలో పాల్గొని ప్రసంగిస్తారు.
Similar News
News October 16, 2025
నల్గొండ: దీపావళి వేళ.. ACBకి పట్టుబడిన అధికారి

దీపావళి సందర్భంగా క్రాకర్స్ షాపు అనుమతి కోసం లంచం తీసుకుంటుండగా అగ్నిమాపక శాఖ కార్యాలయంలో ఒక అధికారి ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. షాపు నిర్వాహకుడి వద్ద రూ.8,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. కార్యాలయంలో తనిఖీలు చేపట్టిన ఏసీబీ బృందం అధికారిని విచారిస్తోంది. పూర్తి వివరాలు విచారణ అనంతరం వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.
News October 16, 2025
పెండింగ్ దరఖాస్తులు పరిష్కరించాలి: కలెక్టర్

రెవెన్యూకు సంబంధించిన పెండింగ్ దరఖాస్తులను యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలని KMR కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించారు. భూభారతి దరఖాస్తులు, ప్రజావాణి విజ్ఞప్తులు తదితర 16 అంశాలపై కలెక్టర్ రివ్యూ చేశారు. రెవెన్యూ సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించరాదని సూచించారు. అదనపు కలెక్టర్ విక్టర్, సబ్ కలెక్టర్ కిరణ్మయి ఉన్నారు.
News October 16, 2025
ASF: గురుకులాల్లో ఖాళీ సీట్ల భర్తీకి దరఖాస్తులు

జిల్లాలోని సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలలలో 6, 7, 8, 9 తరగతుల్లోని ఖాళీ సీట్ల భర్తీకి విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించినట్లు జిల్లా సమన్వయ అధికారి యాదగిరి తెలిపారు. ఆసిఫాబాద్ (బాలురు), రెబ్బెన (బాలికల), సిర్పూర్ టి (బాలికల), కాగజ్ నగర్ (బాలికల) పాఠశాలల్లో ఖాళీలు ఉన్నాయన్నారు. BLV సెట్ ఎంట్రెన్స్ 2025 రాసి మెరిట్ లిస్టులో పేరు ఉన్న విద్యార్థులు అర్హులని వెల్లడించారు.