News October 16, 2025

కరీంనగర్: ‘బియ్యం బుక్కేస్తున్నారు’..!

image

ప్రభుత్వం ఇచ్చిన ధాన్యాన్ని మిల్లింగ్ చేసి తిరిగి సర్కార్‌కు అప్పజెప్పే క్రమంలో మిల్లర్లు అక్రమాలకు పాల్పడుతున్నారు. వీరికి ఉన్నతాధికారులు సహకరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. నిన్న శంకరపట్నం తాడికల్‌లోని రైస్ మిల్లుపై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించగా రూ.6.73 కోట్ల 31,234 క్వింటాళ్ల CMR స్టాక్ దారి మళ్లినట్లు గుర్తించారు. PDPL 140, KNRలోని 111 రైస్ మిల్లులకు CMRకు ప్రభుత్వం ధాన్యం కేటాయించింది.

Similar News

News October 16, 2025

నల్గొండ: దీపావళి వేళ.. ACBకి పట్టుబడిన అధికారి

image

దీపావళి సందర్భంగా క్రాకర్స్ షాపు అనుమతి కోసం లంచం తీసుకుంటుండగా అగ్నిమాపక శాఖ కార్యాలయంలో ఒక అధికారి ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. షాపు నిర్వాహకుడి వద్ద రూ.8,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. కార్యాలయంలో తనిఖీలు చేపట్టిన ఏసీబీ బృందం అధికారిని విచారిస్తోంది. పూర్తి వివరాలు విచారణ అనంతరం వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.

News October 16, 2025

పెండింగ్ దరఖాస్తులు పరిష్కరించాలి: కలెక్టర్

image

రెవెన్యూకు సంబంధించిన పెండింగ్ దరఖాస్తులను యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలని KMR కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించారు. భూభారతి దరఖాస్తులు, ప్రజావాణి విజ్ఞప్తులు తదితర 16 అంశాలపై కలెక్టర్ రివ్యూ చేశారు. రెవెన్యూ సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించరాదని సూచించారు. అదనపు కలెక్టర్ విక్టర్, సబ్ కలెక్టర్ కిరణ్మయి ఉన్నారు.

News October 16, 2025

ASF: గురుకులాల్లో ఖాళీ సీట్ల భర్తీకి దరఖాస్తులు

image

జిల్లాలోని సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలలలో 6, 7, 8, 9 తరగతుల్లోని ఖాళీ సీట్ల భర్తీకి విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించినట్లు జిల్లా సమన్వయ అధికారి యాదగిరి తెలిపారు. ఆసిఫాబాద్ (బాలురు), రెబ్బెన (బాలికల), సిర్పూర్ టి (బాలికల), కాగజ్ నగర్ (బాలికల) పాఠశాలల్లో ఖాళీలు ఉన్నాయన్నారు. BLV సెట్ ఎంట్రెన్స్ 2025 రాసి మెరిట్ లిస్టులో పేరు ఉన్న విద్యార్థులు అర్హులని వెల్లడించారు.