News October 16, 2025
MBNR: స్నాతకోత్సవం.. నిబంధనలు ఇవే..!

✒PhD అవార్డు, బంగారు పతక గ్రహీతలను మాత్రమే గ్రంథాలయం ఆడిటోరియంలోనికి అనుమతి
✒మొబైల్ ఫోన్ల ఆడిటోరియంలో నిషేధం
✒విద్యార్థుల తల్లిదండ్రులు, PU సిబ్బందికి ప్రత్యక్షంగా వీక్షేందుకు ఫార్మసీ కళాశాల ఆడిటోరియంలో ప్రత్యేక ఏర్పాట్లు
✒విద్యార్థులు, ఇతరులు ఇండోర్ కాంప్లెక్స్‌లో డిజిటల్ తెరపై చూసే వెసులుబాటు
✒ఫొటోలు, సెల్ఫీ పాయింట్ల కోసం ప్రత్యేక ఏర్పాట్లు
✒అనుమతి ఉన్న వాహనాలకే పార్కింగ్
Similar News
News October 16, 2025
నాగర్‌కర్నూల్: నూతన ఓటర్లకు గుర్తింపు కార్డులు తపాలా ద్వారా పంపిణీ

జిల్లాలో ఓటర్ల వివరాలను సక్రమంగా క్రమబద్ధీకరించేందుకు సమగ్ర చర్యలు చేపట్టబడుతున్నామని జిల్లా కలెక్టర్ బడావత్ సంతోష్ తెలిపారు. నూతనంగా నమోదైన ఓటర్లకు గుర్తింపు కార్డులను తపాలా శాఖ సహకారంతో పంపిణీ చేసే విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించామని పేర్కొన్నారు. ఈ చర్య ద్వారా ప్రతి ఓటరికి వారి ఓటరు గుర్తింపు కార్డు సురక్షితంగా, సమయానికి అందేలా చూడగలమని తెలిపారు.
News October 16, 2025
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక: తొలి ర్యాండమైజేషన్ పూర్తి

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కోసం ఈవీఎంలు, వీవీప్యాట్ల తొలి ర్యాండమైజేషన్ పూర్తయిందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి తెలిపారు. గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్ర పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఇది నిర్వహించారు. ఆయా పార్టీల నేతల సమక్షంలో స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచామన్నారు. జూబ్లీహిల్స్‌లో మొత్తం 407 పోలింగ్ కేంద్రాలకు 569 బ్యాలెట్ యూనిట్లు, 569 కంట్రోల్ యూనిట్లు, 610 వీవీప్యాట్లు కేటాయించారు.
News October 16, 2025
విద్యార్థులకు వ్యాసరచన పోటీలు: గద్వాల SP

పోలీస్ అమరవీరుల సంస్మరణ దినాన్ని పురస్కరించుకుని 6వ తరగతి నుంచి పీజీ విద్యార్థులకు రాష్ట్ర స్థాయి వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నట్లు గద్వాల ఎస్పీ శ్రీనివాసరావు గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఆన్‌లైన్ ద్వారా తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ భాషల్లో పోటీలు ఉంటాయన్నారు. వ్యాసాలు ఈనెల 28లోగా సమర్పించాలన్నారు. ముగ్గురిని రాష్ట్ర స్థాయికి ఎంపిక చేస్తామన్నారు. వివరాలకు 8712661828 నంబర్‌కు కాల్ చేయాలన్నారు.